వైన్‌షాపుల లైసెన్స్ గడువు పెంపు.. నెల తర్వాతే కొత్త పాలసీ

నవంబరు 1 నుంచి కొత్త మద్యం పాలిసీ అమల్లోకి వస్తుంది. లాటరీ ద్వారా కొత్త వారిని ఎంపిక చేస్తారు.

news18-telugu
Updated: September 25, 2019, 8:33 PM IST
వైన్‌షాపుల లైసెన్స్ గడువు పెంపు.. నెల తర్వాతే కొత్త పాలసీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైన్ షాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 2,216 వైన్ షాపులు యథాతథంగా నడవనున్నాయి. వాస్తవానికి ఈ నెలాఖరుతో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియాల్సి ఉంది. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. కానీ పాత లైసెన్స్‌ల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.

నూతన మద్యం విధానానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అధికారులన నివేదికను పరిశీలించిన ఎక్సైజ్ శాఖ.. మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువును పొడిగించింది. అక్టోబరు 31 వరకు అనుమతులను పొడిగిస్తూ మద్యం అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. ఇక నవంబరు 1 నుంచి కొత్త మద్యం పాలిసీ అమల్లోకి వస్తుంది. లాటరీ పద్దతిలో కొత్త వారిని ఎంపిక చేస్తారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>