కరోనా దెబ్బకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు రవాణా, కార్గో సర్వీసుల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. తొలి త్రైమాసిక మోటారు వాహన పన్ను చెల్లించని వారిని కనికరిస్తూ మరో నెల రోజుల గడువు ఇచ్చింది. రాష్ట్రంలో బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు వంటి వాణిజ్య వాహనాలు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. వీటి యజమానులు ప్రతి మూడు నెలలకోసారి మోటార్ వెహికల్ టాక్స్‌ను చెల్లించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 30లోపే టాక్స్ చెల్లించాల్సి ఉండగా, ఆ గడువును పెంచుతూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.
లాక్డౌన్ కారణంగా వాహనాలు నిలిచిపోయి నష్టాల్లో ఉన్నామని, వాహన పన్ను చెల్లింపును వాయిదా వేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం, క్యాబ్స్ యజమానుల అసోసియేషన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో పన్ను చెల్లింపునకు నెల రోజుల గడువును ప్రభుత్వం ప్రకటించింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.