మద్యం షాపు యజమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం షాపుల లైసెన్స్ గడువు పొడిగించింది. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్ షాపులు మూత పడటంతో లైసెన్స్‌లను నెల రోజుల పాటు పొడిగించింది తెలంగాణ సర్కార్. కరోనా కారణంగా మిగతా వాణిజ్య సంస్థల తరహాలోనే వైన్స్, బార్లు మూతపడటంతో.. తాము నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని మద్యం షాపుల యజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తమ లైసెన్స్‌ను పొడిగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో బార్లు, వైన్స్‌ల లైసెన్సులను ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అక్టోబర్ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈనెలాఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్ 31 వరకు కొనసాగనున్నాయి. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని గత కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా నిన్న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. త్వరలో జరగబోయే మద్యం దుకాణాల టెండర్ల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021-23 వరకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంపు ?
Telangana: కేసీఆర్ కాదు కేటీఆర్.. వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి.. అసలు కారణం ఇదేనా ?
దేశంలోనే మొదటిసారిగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల అందరికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినందుకు మంత్రి శ్రీనివాసగౌడ్‌కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Wine shops