ఇంటికే మామిడి పండ్ల డెలివరీ.. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెర తీసింది. ఫోన్ లో ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే మామిడి పండ్లను డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

news18-telugu
Updated: April 28, 2020, 1:16 PM IST
ఇంటికే మామిడి పండ్ల డెలివరీ.. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అసలే వేసవి.. తియ్యని మామిడి పండ్లు చూస్తే నోరూరుతుంది. రసాలు, బంగినపల్లి, మల్గోబా, కలమామిడి.. ఇలా ఆ పేర్లు విన్నకొద్దీ తినాలని కోరిక పుడుతుంది. అయితే, మామిడి పండ్ల అమ్మకంపై లాక్‌డౌన్ భారీ ప్రభావమే చూపుతోంది. ఒక్క మామిడి ముక్కైనా తింటే బాగుండు..! అనిపిస్తోంది కదా. అందుకే తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెర తీసింది. ఫోన్ లో ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే మామిడి పండ్లను డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ఉద్యాన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. మే 1 నుంచి ఆర్డర్‌పై మామిడి పండ్లను సరఫరా చేయనుంది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా రైతుల నుంచి మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు చేర్చాలని ఉద్యాన శాఖ, ఉద్యాన అభివృద్ధి సంస్థ నిర్ణయించాయి. ఇందుకోసం రైతుల తోటల నుంచే మామిడి కాయలను సేకరించి సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 5 కిలోల చొప్పున ప్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పోస్ట్‌లో పంపనుంది. అయితే, ఈ సౌలభ్యం ప్రస్తుతానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఉండనుంది. తర్వాత జిల్లాలకు కూడా కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఐదు కిలోల మామిడి పండ్ల ధరను డెలివరీ ఛార్జీలతో కలిపి రూ.350గా నిర్ణయించింది ప్రభుత్వం. ఎన్ని బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కావాలన్నా బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చని, ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతాయని ఉద్యానశాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్రామిరెడ్డి చెప్పారు. మామిడి పండ్లు కావాలనుకునే వాళ్లు 7997724925, 7997724944 నంబర్లకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్​ చేసి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయవచ్చన్నారు. 7997724925 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే చేసి పూర్తి అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే వారు ఆంధ్రాబ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బు జమ అయ్యేలా అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్​ 013910100083888, ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​సీ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీబీ0000139కు మనీ పంపాలని తెలిపారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 28, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading