ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

కరోనా లాక్‌డౌన్ కారణంగా కోత విధించిన వేతనాలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: September 30, 2020, 8:00 PM IST
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా కారణంగా కోత విధించిన వేతనాలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. బకాయిలు చెల్లింపుల విధానాన్ని ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్‌లో రెండు విడతలుగా చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా చెల్లింపులు జరిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్, మే, నెలలకు సంబంధించి ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్‌కు సంబంధించి ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షనర్లకు పూర్తి పింఛన్‌ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల బకాయిలపై ప్రభుత్వం ఉత్తర్వులు


అయితే కరోనా కారణంగా వేతనాలు, పెన్షన్లలో విధించిన కోతకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం ఎఫ్పుడు చెల్లిస్తుందనే దానిపై ఉద్యోగులు, పెన్షనర్లు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. అయితే కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, పెన్షనర్లకు కోత విధించిన వేతనాలు,బకాయిలను దశలవారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Published by: Kishore Akkaladevi
First published: September 30, 2020, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading