హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణ రైతులకు షాక్... ఇప్పుడు అన్నదాతలు ఏం చేయాలి?

Telangana: తెలంగాణ రైతులకు షాక్... ఇప్పుడు అన్నదాతలు ఏం చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రైతులకు షాక్. ఈసారి రాష్ట్రంలో రైతులు ఉత్పత్తి చేసిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

తెలంగాణ రైతులకు షాక్. ఈసారి రాష్ట్రంలో రైతులు ఉత్పత్తి చేసిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల మీద కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్‌లో పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సి ఉంది. ఇంకా కేంద్రం ప్రకటించలేదు. కాబట్టి, అది ప్రకటించే వరకు ఏ ధరకు కొనాలనే అంశంపై క్లారిటీ లేదు. కాబట్టి, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రొక్యూర్‌మెంట్ చేయడం లేదు. అదే సమయంలో ప్రైవేట్ వ్యాపారులకు రైతులు పంటలను అమ్ముకునేటప్పుడు వారు నష్టపోకుండా మాత్రం చూడాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అలాగే, ఎవరైనా రైతులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి విక్రయించాలనుకుంటే వారికి సహకరించాలని కూడా అధికారులకు చెప్పారు.

సంక్రాంతి పండుగ సమయానికి రబీ పంట చేతికి వస్తుంది. పంటలను మార్కెట్లకు తీసుకుని వెళ్తారు రైతులు. పంటలను అమ్మడానికి తీసుకొస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనడానికి ఎందుకు వీలుకాదో రైతులకు అధికారులు వివరంగా చెప్పాలని సూచించారు. రైతులకు సరైన ధర లభించేలా అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల మార్కెట్లు మూతపడతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అలాగే, ధాన్యం కొనే బాధ్యతల నుంచి కూడా తప్పుకుంది. కేంద్రం చెప్పినట్టే రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని సూచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను మొదట వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన భారత్ బంద్‌లో ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత మనసు మార్చుకుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎందుకు యూ టర్న్ తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. అయితే, కేంద్రం తెచ్చిన చట్టాల్లో ఎక్కడా మార్కెట్ యార్డులను ఎత్తేయాలని లేదని, కేసీఆర్ ఎందుకు వాటిని ఎత్తేస్తున్నారంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే ధాన్యం కొనుగోలును నిలిపివేస్తుంది.

First published:

Tags: CM KCR, Farmers, New Agriculture Acts, Telangana

ఉత్తమ కథలు