ఇంటర్‌ బోర్డు నుంచి గ్లోబరీనా ఔట్... కొత్త సంస్థకు సప్లిమెంటరీ ఫలితాల బాధ్యత

విద్యార్థులు (File)

Intermediate Results : గందరగోళ ఫలితాలతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు పరోక్ష కారణమైన గ్లోబరీనా సంస్థను బాధ్యతల నుంచీ తప్పించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.

  • Share this:
ఇంటర్‌ ఫలితాల్ని అడ్డదిడ్డంగా రిలీజ్ చేసి, తీవ్ర గందరగోళం సృష్టించి, ఎంతో మంది విద్యార్థుల మరణాలకు పరోక్ష కారణమైన గ్లోబరీనా వేల్యుయేషన్ సంస్థను ఇంటర్‌ బోర్డు బాధ్యతల నుంచీ తొలగించింది. త్వరలో జరిగే ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్ని నిర్వహించే బాధ్యత నుంచీ గ్లోబరీనాను తప్పించింది. తద్వారా విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఉండే టెన్షన్లను దూరం చేసినట్లైంది. ఇక సప్లిమెంటరీ ఫలితాల నిర్వహణ బాధ్యతను కొత్త సంస్థకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ సంస్థను ఎంపిక చెయ్యాలో నిర్ణయించమని తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్)ని కోరింది. ఇందుకు సంబంధించి ఆసక్తి ఉన్న సంస్థలు ముందుకు రావచ్చంటూ టీఎస్‌టీఎస్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

2018-19 నుంచీ మూడేళ్ల పాటు ఇంటర్ పరీక్షల ఫలితాల నిర్వహణ బాధ్యతల్ని ఇంటర్‌ బోర్డు... ఈ ఏడాది గ్లోబరీనాకు అప్పగించింది. ఐతే... ఫలితాల్ని కంప్యూటర్లలో ప్రాసెస్ చేస్తున్నప్పుడు... తేడా వచ్చిందని గ్లోబరీనా సంస్థ ప్రకటించింది. రూ.4.80 కోట్లు ఖర్చుపెట్టి టెండర్‌ ఇచ్చినా... గ్లోబరీనా... ప్రభుత్వం ఆశలకు గండికొట్టింది. మొదటి ఏడాదే పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. గ్లోబరీనా ప్రతి అంశంలోనూ సాంకేతిక తప్పిదాలు చేసిందని ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తేల్చింది.

గ్లోబరీనా చేసిన తప్పులకు ప్రభుత్వందే బాధ్యత అంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనలు చేశాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్‌ బోర్డు వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని గ్లోబరీనాను తొలగించింది. ఈసారి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు పక్కాగా వచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి TSTS కొన్ని కఠినమైన రూల్స్ తెస్తోంది. ఫలితాల నిర్వహణ బాధ్యతలు పొందాలనుకునే సంస్థ.. కచ్చితంగా ఇప్పటివరకు మినిమం రెండు ప్రాజెక్టుల్లో 10 లక్షల మంది విద్యార్థుల ఫలితాల్ని వాల్యుయేషన్ చేసిన అనుభవం ఉండాలనే కండీషన్ పెట్టింది. 2015-2018 మధ్య వరుసగా మూడేళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్శిటీలు, కొన్ని నియామక బోర్డులు, ఇతర విద్యా సంస్థల్లో ఫలితాల్ని ప్రాసెస్‌ చేసిన అనుభవం ఉండాలని మరో రూల్ కూడా పెట్టింది. అంతేకాదు... సంస్థలో కనీసం 25 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తూ ఉండాలనీ, ఆ సంస్థ రెండేళ్లలో ఇంటర్‌ బోర్డులో పని చేసి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ రూల్స్ కారణంగా... ఎంతో అనుభవం ఉన్న సంస్థ మాత్రమే సప్లిమెంటరీ ఫలితాల బాధ్యతను పొందే ఛాన్సుంది. అందువల్ల ఫలితాలు పద్ధతిగా వస్తాయని మనం భావించవచ్చు.

 

ఇవి కూడా చదవండి :

మాజీ ప్రియుడి బ్లాక్‌మెయిల్... ఓ యువతి ఆవేదన...

అది తోడేలు కాదు కుక్క... జూ అధికారులపై పర్యాటకుల ఫైర్... అసలు విషయమేంటంటే...

స్టోన్‌హెంజ్ మిస్టరీ వీడబోతోందా... మిస్సింగ్ అయిన రాయి ఏం చెబుతోంది...


వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం

First published: