Home /News /telangana /

TELANGANA GOVERNMENT BAN PRIVATE PRACTICE OF GOVERNMENT DOCTORS ISSUE NEW ORDERS AK

Telangana: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: వైద్య విద్య సర్వీసెస్ నిబంధనలకు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించింది. వైద్య విద్య సర్వీసెస్ నిబంధనలకు సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వైద్యులు తమ విధి నిర్వహణ అనంతరం ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ఈ కారణంగా చాలామంది వైద్యులు(Government Doctors) విధులు ఆలస్యంగా రావడం.. దీర్ఘకాలంపాటు సెలవులు పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుకు(Private Practice) దూరంగా ఉండాలనే నిబంధన విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనూ ఇలాంటి నిబంధన విధించినప్పటికీ.. అది పెద్దగా అమలు కాలేదు. ప్రభుత్వ వైద్యులు సైతం ఈ నిబంధనను తీవ్రంగా వ్యతిరేరించారు.

    విధి నిర్వహణ సమయం అనంతరం తాము ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఈ నిబంధన అమలు కాలేదు. అయితే త్వరలోనే రాష్ట్రంలోని వైద్యవిభాగంలో వైద్యులు సహా వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం(Telangana Government).. ప్రభుత్వ వైద్యులుగా విధుల్లో చేరే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదని నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ముందుగానే వైద్యుల నుంచి రాతపూర్వక అంగీకారం తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమే వైద్య విద్య సర్వీస్ నిబంధనలను సవరించింది.



    మరోవైపు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తీరుపై జూనియర్ డాక్టర్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యులను సస్పెండ్ చేయడాన్ని జూనియర్ డాక్టర్ల సంఘం ఖండించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వల్లే బయటకు పంపుతున్నామని జూడాల సంఘం వెల్లడించింది. మందులు ఉన్నాయో లేదో చూసుకోవడం వైద్యుల పనికాదని తెలిపింది. ఔషధాల కోసం పంపే ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

    Telangana: ప్రభుత్వ పాఠశాలలో చేరితే నెలకు రూ.500, యూనిఫామ్, బుక్స్ ఫ్రీగా ఇస్తున్న సర్పంచ్ .. ఏ జిల్లాలో అంటే

    Telangana| Congress: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదా ? హైకమాండ్‌కు కీలక రిపోర్ట్ ?

    ఔషధాలు ఉన్నా బయటికి రాసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎలాంటి దర్యాప్తు చేయకుండా వెంటనే సస్పెన్షణ్ అంటే ఎలా ? అని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారా ? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందితేనే ప్రశ్నించే అర్హత ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లోపాల సంగతి మంత్రి హరీశ్ రావుకు తెలుసని.. హరీశ్ రావు ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Harish Rao, Health department, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు