హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఎమ్మెల్యేలకు ఎరకేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్ సర్కార్..

Telangana: ఎమ్మెల్యేలకు ఎరకేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్ సర్కార్..

సుప్రీంకోర్టు, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సుప్రీంకోర్టు, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

MLAs Poaching Case: సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని దవే అన్నారు. ఈ అంశాన్ని రేపు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దవేకు సీజేఐ సూచంచారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేలకు ఎరకేసుపై (MLAa Poaching Case)తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. హైకోర్టు కేసును సీబీఐకి(CBI) అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని దవే అన్నారు. ఈ అంశాన్ని రేపు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దవేకు సీజేఐ సూచంచారు. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతిస్తామన్న సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

అంతకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటీషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ పేర్కొంది. ఇక ఈ కేసుపై సీబీఐ FIR నమోదు చేసిందా ? అని హైకోర్టు ప్రశ్నించగా ఇంకా నమోదు చేయలేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీ కోసం 3 సార్లు ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందించలేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

మరోవైపు సీబీఐ (CBI) కేసు నమోదు చేయాలని, ఫైల్స్ అప్పగించాలని ఒత్తిడి తెస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక సుప్రీంకోర్టు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు (High Court) ప్రశ్నించగా వారం రోజులు పడుతుందని ఏజి తెలిపారు. పిటీషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అని కోర్టు పేర్కొంది రేపు ఉదయం చీఫ్ జస్టిస్ ముందు అనుమతి కోరుతామని ఏజీ పేర్కొన్నారు. దీనితో తదుపరి విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. కాగా నిన్న ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Telangana New Secretariat: సెక్రెటేరియేట్ లో జరిగింది ప్రమాదమా లేక నరబలా? హైకోర్టులో KA పాల్ పిల్

Big News: ఎమ్మెల్యేల ఎర కేసు..ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా!

ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై విచారణ జరిపిన కోర్టు నిన్న కీలక తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని అంతా భావించగా..లంచ్ మోషన్ కు హైకోర్టు అనుమతించడంతో ఏజీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేసు విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

First published:

Tags: Supreme Court, Telangana