రాత్రి 11 వరకు వైన్ షాప్‌లు.. తెలంగాణ మద్యం పాలసీ వివరాలు

జనాభా ప్రాతిపదికన లైసెన్స ఫీజును ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉన్న 4 శ్లాబులను 6 శ్లాబులుగా మార్చింది.

news18-telugu
Updated: October 3, 2019, 3:32 PM IST
రాత్రి 11 వరకు వైన్ షాప్‌లు.. తెలంగాణ మద్యం పాలసీ వివరాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నూతన మద్యం విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మద్యం పాలిసీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో 2,216 మద్య దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త మద్యం విధానం 2019 నవంబరు 1 నుంచి 2020 అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుంది. వైన్ షాప్స్ దరఖాస్తు ఫీజును రూ. లక్ష నుంచి రెండు లక్షలకు పెంచారు. దీని తిరిగి ఇవ్వరు. గతంలో మాదిరే లాటరీ విధానంలో మద్యం షాపులను ఎంపిక చేస్తారు. ఇక జనాభా ప్రాతిపదికన లైసెన్స ఫీజును ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉన్న 4 శ్లాబులను 6 శ్లాబులుగా మార్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులను నడుపుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయి.

లైసెన్స్ ఫీజు వివరాలు:
5 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు

5వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.55 లక్షలు
50వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలు


లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు
5 లక్షల నుంచి 25 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.కోటి 10 లక్షలు
First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>