హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషాకు భారీ నజరానా.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన..

Telangana: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషాకు భారీ నజరానా.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన..

నిఖత్ జరీన్ (ఫైల్ ఫోటో)

నిఖత్ జరీన్ (ఫైల్ ఫోటో)

Telangana: నగదు బహుమతితో పాటు వీరికి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇటీవల టీర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రెండు కోట్ల రూపాయల నగదు బహుమతి అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బాక్సర్ జరీన్‌తో(Nikat Zarine) పాటు మహిళా ప్రపంచ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ ఈషా సింగ్‌కు(Eesha Singh) కూడా రెండు కోట్ల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. నగదు బహుమతితో పాటు వీరికి హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్(Jubliee Hills) లేదా బంజారా హిల్స్‌లో ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు(Kinnera Mogilaiah) కోటి రూపాయల నగదు సాయంతో పాటు బీఎన్‌ రెడ్డి నగర్‌లో ఇంటి స్థలం కేటాయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇటీవల టర్కీలో జరిగిన మహిళా ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ విభాగంలో ఆమె జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌తో జరిగిన టైటిల్‌ పోరులో 5–0తో గెలుపొంది గోల్డ్ మెడల్ సాధించింది. భారతావని పులకించేలా చేసింది.

ఇక జర్మనీలోని సుహ్ల్‌లో జరిగిన ISSF జూనియర్ ప్రపంచకప్‌లో యువ షూటర్ ఈషా సింగ్ జట్టు స్వర్ణం గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఈషా, మను భాకర్‌తో కలిసి, పాలక్ అదే 16-8 తేడాతో జార్జియన్స్ సలోమ్ ప్రొడియాష్‌విలి, మరియం అబ్రామిష్‌విలి, మరియామి ప్రొడియాష్‌విలీలను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. మిక్స్‌డ్ టీమ్‌లో సౌరభ్ చౌదరితో కలిసి ఈషా స్వర్ణం సాధించింది.

Telangana BJP: మరో తెలంగాణ బీజేపీ నేతకు కీలక పదవి ?.. లక్ష్మణ్ తరువాత..

Telangana| BJP: మళ్లీ తెలంగాణలో బీజేపీ సందడి.. హైదరాబాద్‌లో కీలక సమావేశాలు.. రాజకీయ దండయాత్రేనా ?

ఇటీవల కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పురస్కారం ఇంకా దక్కలేదని చెప్పినట్లుగా ఆ వీడియో ఉంది. దీన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటూ ఉన్నారని మొగిలయ్య ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన కళ కారణంగానే గుర్తింపు ఇచ్చిందని.. బీజేపీ వారు నాతో మాట్లాడిన వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మొగిలయ్య. ఈ నేపథ్యంలో మొగిలయ్యకు ప్రకటించిన నగదు సాయాన్ని, ఇంటి స్థలాన్ని వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు