సచివాలయ భవనాల కూల్చివేత.. మీడియాకు సర్కార్ ఓకే.. కానీ

కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.


Updated: July 27, 2020, 10:42 PM IST
సచివాలయ భవనాల కూల్చివేత.. మీడియాకు సర్కార్ ఓకే.. కానీ
తెలంగాణ సచివాలయం
  • Share this:
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత సందర్భంగా కొద్దిరోజుల నుంచి సచివాయలంలోకి మీడియాను అనుమతించని రాష్ట్ర ప్రభుత్వం... ఈ రోజు సాయంత్రం కూల్చివేత వార్తలు సేకరించడానికి మీడియాను అనుమతిస్తామని ప్రకటించింది. కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సచివాలయ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి.


శిథిలాలు మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేశారు. మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తయిన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు. కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ఈ రోజు మీడియాను తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.

Telangana secretariat history, telangana old secretariat, telangana secretariat demolished, telangana news
సచివాలయం భవనం (ఫైల్ ఫోటో)


అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బి.ఆర్.కె. భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్ళి, సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Published by: Kishore Akkaladevi
First published: July 27, 2020, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading