తెలంగాణలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలు.. గవర్నర్ ఆమోదం

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిలిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.

news18-telugu
Updated: May 20, 2020, 9:35 PM IST
తెలంగాణలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలు.. గవర్నర్ ఆమోదం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో 5 కొత్త యూనివర్సిటీ ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడంతో.. 1.మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్భుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, 2. మెదక్‌ జిల్లా సదాశివ్‌పేట మండలం కంకోల్‌లో వోక్సెన్‌ యూనివర్సిటీ, 3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దూళపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, 4. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, 5.మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో అనురాగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి.
First published: May 20, 2020, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading