Home /News /telangana /

TELANGANA GOVERMENT HANDED OVER LANDS ENCROACHED BY JAMUNA HATCHERIES TO BENEFICIARIES PCV MDK

Eatala Rajender : ఈటల రాజేందర్‌కు భారీ షాక్.. ఆ భూములు పంచేశారు!

Eatala Rajender

Eatala Rajender

జమున హేచరీస్ భూములను ప్రజలకు పంపిణీ చేసే సందర్భంలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. తూప్రాన్, వెల్దుర్తి, చిన్న శంకరంపేట, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, శివంపేట పరిధిలోని అన్ని పోలీస్ సిబ్బందితోపాటు ఎస్ఐలు డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించారు.

ఇంకా చదవండి ...
Eatala Rajender : భూముల కబ్జా వివాదంలో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు మరో షాక్ తగిలింది. జమున హేచరీస్ సంస్థ కబ్జా చేసిందని ఆరోపణలు వచ్చిన భూములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హాకీంపేట గ్రామ శివారులో ఈటల రాజేందర్ సంబంధిత జమున హెచరీస్ పలు భూములను ఆక్రమించుకుందని స్థానిక రైతులు ప్రభుత్వానికి గతంలో కంప్లయింట్ చేశారు. వీటిపై రెవెన్యూ, పోలీస్ శాఖలు దర్యాప్తు చేసి.. కబ్జా జరిగిందని ప్రభుత్వానికి రిపోర్టులు ఇచ్చాయి. దీంతో.. ఈ భూములను స్వాధీనం చేసుకుని తాజాగా లబ్దిదారులకు అందించారు.

హకీంపేట, అచ్చంపేట గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు 85 ఎకరాల భూములను పంపిణీ చేశారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లను అందజేశారు.పేదల భూములపై బీజేపీ దురాక్రమణ చేసిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను కొల్లగొట్టి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గద్దెనెక్కడం ఆనవాయితీగా పెట్టుకున్నారని అన్నారు. బీజేపీ మోసపూరిత పార్టీ అన్నారు. పేదలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ భార్య పేరు మీద ఉన్న జమున హెచరీస్ సంస్థ లాక్కోవడం నీచ రాజకీయాలకు తావిస్తోందన్నారు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వమే పేదవారిగా గుర్తించి వారికి భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అలాంటి బీజేపీ రేపు హైదరాబాద్లో జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయడం విడ్డూరమని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Read Also : Dark neck : మెడ దగ్గర నల్లగా ఉందా..ఇలా చేస్తే సులువుగా పోతుంది

జమున హెచరీస్ భూములను ప్రజలకు పంపిణీ చేసే సందర్భంగా పోలీసు బలగాలు భారీగా మోహరించారు. తూప్రాన్, వెల్దుర్తి, చిన్న శంకరంపేట, కౌడిపల్లి, కొల్చారం, నర్సాపూర్, శివంపేట పరిధిలోని అన్ని పోలీస్ సిబ్బందితోపాటు ఎస్ఐలు డీఎస్పీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అలజడి జరగకుండా భారీ బందోబస్తు కల్పించారు. లబ్దిదారులకు భూముల పంపిణీ చేశారు.

-(వీరన్న, మెదక్ జిల్లా రిపోర్టర్)
Published by:V. Parameshawara Chary
First published:

Tags: Eatala rajender, Huzarabad, Jamuna hatcheries, Medak

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు