Home /News /telangana /

TELANGANA GOV REQUEST TO HIGH COURT OVER SSC EXAMS SK

పదో తరగతి పరీక్షలపై హైకోర్టుకు తెలగాణ ప్రభుత్వం విజ్ఞప్తి

 హైకోర్టు(ఫైల్ ఫోటో)

హైకోర్టు(ఫైల్ ఫోటో)

పరీక్షల విషయంలో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

    లాక్‌డౌన్ వల్ల వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ యోచిస్తోంది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. పరీక్షల విషయంలో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నిపుణుల సలహా మేరకు కరోనా నివారణకు సంబంధించిన చర్యలను చేపడతామని.. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం విజ్ఞప్తిని విన్న హైకోర్టు మే 19న పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

    కాగా, కరోనా వైరస్ వల్ల ఏపీలో పదో తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. ఓ వైపు విద్యా సంవత్సరం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మూడు పరీక్షలు మాత్రమే జరిగాయి. మరో 8 పేపర్లకు పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున.. హైకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Hyderabad, Ssc exams, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు