తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్(Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కనీస సర్వీసును సర్కార్.. రెండేళ్లకు తగ్గించింది. ఇదివరకు ప్రమోషన్లకు సంబంధించి మూడేళ్ల కనీస సర్వీసు నిబంధన అమల్లో ఉంది. అయితే 2020-21 ప్యానల్ సంవత్సరానికి ప్రమోషన్లకు కనీస సర్వీసును రెండేళ్లకు కుదిస్తూ ప్రభుత్వం జనవరిలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రమోషన్ల(Promotions) కనీస సర్వీసు తగ్గింపు మిగత సంవత్సరాలకు కూడా వర్తింపజేయాలని లేదంటే.. చాలా మంది ఉద్యోగులు నష్టపోతారని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులందరికి ఊరట కలిగించేలా.. ప్యానల్ సంవత్సరాలకు సంబంధం లేకుండా ఉద్యోగులు పదోన్నతి కనీస సర్వీసును రెండేళ్లకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా జీఏడీ ఉత్తర్వులు జారీచేసింది. డీపీసీ నిర్వహించే సమయానికి రెండేళ్ల కనీస సర్వీసు(Minimum Service for Promotions) ఉంటే పదోన్నతులకు అర్హులన్న ప్రభుత్వం.. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు గమనిక.. నీటి సరఫరాలో అంతరాయం.. ఈ ప్రాంతాలకు అలర్ట్..
ఇదిలా ఉంటే శుక్రవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు శుక్రవారం బీఆర్కే భవన్‌లో సీఎస్ సోమశ్‌కుమార్‌ను కలిశారు. రెవెన్యూశాఖలో వివిధ క్యాడర్ల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇతర సమస్యలను సైతం పరిష్కరించాలని వారు సీఎస్‌ను కోరారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌లో పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేసి నూతన జోనల్ విధానం ప్రకారం బదిలీలు చేపడుతామని ట్రెసా ప్రతినిధులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హామీఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Telangana Government