• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA GOLDEN IDOL IS ON THE FARM IN MULUGU DISTRICT SU

Telangana: రైతు పొలంలో బంగారు విగ్రహం.. ఇంట్లో ఉంచి పూజలు.. విషయం గ్రామస్తులకు తెలియడంతో..

Telangana: రైతు పొలంలో బంగారు విగ్రహం.. ఇంట్లో ఉంచి పూజలు.. విషయం గ్రామస్తులకు తెలియడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ఓ రైతు పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపగా.. బంగారు మల్లన్న విగ్రహం లభించింది. వారం రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    ఓ రైతుకు అతని పొలంలో బంగారు విగ్రహం దొరికింది. ఇలా దొరికిన బంగారు మల్లన్న విగ్రహాన్ని అతడు ఇంట్లో ఉంచి పూజలు చేస్తున్నాడు. అయితే ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో.. వారు విచారణ చేపట్టారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బిల్ల నారాయణ అనే వ్యక్తి ముప్పనపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కన్నాయిగూడెం మండలంలోనే బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలసి నారాయణ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. మే 26వ తేదీన నారాయణ అతని పొలం ఈ తవ్వకాలు చేపట్టాడు. తవ్వకాలు జరిపిన ఏదో ఒక జంతువును బలి ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు.

    అయితే నారాయణ, మరో వ్యక్తి కలిసి తవ్వకాలు జరపగా.. 500 గ్రాముల బరువు ఉన్న బంగారు మల్లన్న దేవుని విగ్రహం బయటపడింది. దీంతో నారాయణ ఆ విగ్రహాన్ని తన ఇంట్లో ఉంచి పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో నారాయణ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతని ఇంట్లో బంగారు మల్లన్న విగ్రహానికి పూజలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి నారాయణను పోలీసులు విచారించారు.

    Viral Video: రొట్టెలు చేస్తున్న యువతి.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న వీడియో.. ఆ స్మైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

    ఇక, పోలీసుల విచారణలో నారాయణ పలు అంశాలను తెలిపాడు. తమ తాతముత్తాల నుంచి మల్లన్న దేవునికి పూజలు చేసేవాళ్లని చెప్పాడు. ఓ రోజు పొలం విగ్రహం ఉందనే కల వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక, నారాయణకు తవ్వకాల్లో నారాయణకు భారీగా సంపద లభించిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని పొలంలో భారీగా గుప్త నిధులు ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇక, ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని.. తహసీల్దార్ దేవ్ సింగ్ చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు