హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Floods: హైదరాబాద్‌ను మరిచిపోని మాజీ గవర్నర్ నరసింహన్.. రూ. 25 వేలు విరాళం

Hyderabad Floods: హైదరాబాద్‌ను మరిచిపోని మాజీ గవర్నర్ నరసింహన్.. రూ. 25 వేలు విరాళం

మాజీ గవర్నర్ నరసింహన్(ఫైల్ పొటో)

మాజీ గవర్నర్ నరసింహన్(ఫైల్ పొటో)

హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడంపై మాజీ గవర్నర్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు ఈఎస్‌ఎల్ నరసింహన్. చాలా కాలంపాటు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నివాసం ఉన్న నరసింహన్.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్ నగరంతోపాటు, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో ఆయన మంచి అనుబంధం ఉంది. అయితే తాజాగా హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడంపై మాజీ గవర్నర్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను, పునరావాస శిబిరాల ఏర్పాటును ఆయన అభినందించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

  అలాగే వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలనే సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. తన పర్సనల్ సేవింగ్స్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి(సీఎంఆర్‌ఎఫ్‌)కు నరసింహన్ రూ. 25 వేలు విరాళంగా ఇచ్చారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ వరదలపై స్పందించిన నరసింహన్‌కు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

  ఇక, హైదరాబాద్‌ కురిసిన భారీ వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టంతోపాటు, కొంత ప్రాణ నష్టం కూడా సంభించింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తమిళనాడు, ఢిల్లీ ముఖ్యమంత్రులు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటించారు. అలాగే పలు ప్రముఖ కంపెనీలు, తెలుగు సినీ ప్రముఖులు కూడా వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Hyderabad Floods

  ఉత్తమ కథలు