హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana@8: తెలంగాణకు ఎనిమిదేళ్లు.. అప్పుడెలా ఉంది? ఇప్పుడేం సాధించింది?

Telangana@8: తెలంగాణకు ఎనిమిదేళ్లు.. అప్పుడెలా ఉంది? ఇప్పుడేం సాధించింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Formation Day: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమై నేటితో 8 ఏళ్లు గడిచాయి. మరి ఇన్నేళ్లలో తెలంగాణ ఏం సాధించింది? అప్పడెలా ఉంది? ఇప్పడెలా మారింది?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం (Telangana State) ఏర్పడి నేటితో 8 ఏళ్లు గడిచాయి. సరిగా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున.. తెలంగాణ (Telangana Formation Day) ఏర్పాటయింది. అమరవీరుల త్యాగానికి ఫలితం దక్కింది. సకల జనుల కల సాకారమైంది. మరి తెలంగాణ ఏర్పాటు ఎలా జరిగింది? ఉద్యమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణలో ఏం మారింది? అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.... తెలంగాణ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం.

తెలంగాణ ఉద్యమం మొన్నీమధ్య జరిగింది కాదు. 1969లోనే మహోద్యమం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడింది. స్వరాష్ట్రం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేశారు. కానీ అప్పటి ప్రభుత్వాలు మాత్రం కాలయాపన చేస్తూ వచ్చాయి. హామీలకే పరిమితమయ్యాయి. ఐతే 2001లో తెలంగాణ సాధనే లక్ష్యంగా.. కేసీఆర్ (kcr role in Telangana Formation) నేతృత్వంలో.. టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ఏర్పాటుకావడంతో.. మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఎంతో మంది నేతలు పదవులను వదలుకొని.. కేసీఆర్ వెంట నడిచారు. రాష్ట్రం కోసం కొట్లాడారు. వారికి ఉద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. ఐతే 2009 నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని మలుపుతిప్పింది. కేసీఆర్‌కు మద్దతుగా సకల జనులు రోడ్డెక్కి.. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో.. ఢిల్లీ పెద్దలు దిగి రాక తప్పలేదు. ఈ క్రమంలోనే 2009 డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది.

Telangana: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషాకు భారీ నజరానా.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన..

తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన రాగానే.. ఆంధ్రా నేతలు అప్రమత్తమయ్యారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణకు అడ్డుపడ్డారు. ఈ క్రమంలోనే 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. అనంతరం 2013, జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా... 2013 అక్టోబరు 3న కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఆ తర్వాత బీజేపీ, ఇతర పార్టీల సహకారంతో... 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.  2014, మార్చి 1న రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. అనంతరం 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

Telangana BJP: మరో తెలంగాణ బీజేపీ నేతకు కీలక పదవి ?.. లక్ష్మణ్ తరువాత

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీనే ప్రజలు గెలిపించారు. ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో.. టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014 మాత్రమే కాదు... ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కూడా ఆయనకే రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో మారిపోయింది. అభివృద్ధి, సంక్షేమంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాల రాష్ట్రంగా మారింది. వ్యవసాయంలో ఎంతో పురోగతి సాధించి.. ఇప్పుడు అన్నపూర్ణగా అవతరించింది. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయినికి ఉచిత కరెంటు పథకాలు రైతాంగానికి ఎంతో మేలు చేశాయి. ప్రాజెక్టులను పూర్తి చేసి.. సాగు నీరు అందించడంతో.. పల్లెలన్నీ పచ్చబడ్డాయి. తెలంగాణ సాధించిన విజయాల్లో కరెంట్ ఒకటి. 2014 ముందు విద్యుత్ కోతలతో అల్లాడిన తెలంగాణ.. ఇప్పుడు 24 గంటల కరెంట్‌తో వెలిగిపోతోంది.

అంతేకాదు సంక్షేమంలోనూ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు 3,016 పెన్షన్, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, గొల్ల కురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు చేపల పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలు.. తెలంగాణ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఐటీ రంగంలోనూ హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఇలా ఎనిమిదేళ్లలనే ఎన్నో సాధించింది తెలంగాణ.

Telangana| BJP: మళ్లీ తెలంగాణలో బీజేపీ సందడి.. హైదరాబాద్‌లో కీలక సమావేశాలు.. రాజకీయ దండయాత్రేనా ?

మరోవైపు ప్రతిపక్షాల వాదన మరోలా ఉంది. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. హామీలతో కాలయాపన చేశారని విమర్శిస్తున్నారు. మాటలు తప్ప.. చేతలు లేదని ఎద్దేవా చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో.. ఇప్పుడు వాటి ఊసే లేకుండా పోయిందని దుమ్మెత్తిపోస్తున్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని.. ప్రజల కలలు కలగానే మిగిలిపోయాయని.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమని.. సీఎం కేసీఆర్ గద్దె దిగక తప్పదని స్పష్టం చేస్తున్నాయి.

First published:

Tags: CM KCR, Telangana, Telangana Formation Day, Trs

ఉత్తమ కథలు