తెలంగాణ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల (Telangana Formation Day)సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ (CM KCR) శుభవార్త చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయాలను ఆయన ప్రకటించాారు. హైదరాబాద్‌లో బస్తీ దవఖానాల్లాగే.. గ్రామాల్లోనూ పల్లె దవాఖానాల (Village Hospitals)ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు రేపటి నుంచిపల్లె ప్రగతి ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. గ్రామీణ యువత కోసం ప్రభుత్వ క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చిందని ఇందుకోసం 350 బస్తీ దవాఖానాలను (Hyderabad basthi dawakhanas) మంజూరు చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో 256 దవాఖానాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీదవాఖానాలను కొత్తగా ప్రారంభించబోతున్నట్లు సీఎం చెప్పారు. బస్తీ దవాఖానాలు ఇచ్చిన స్ఫూర్తితో.. గ్రామాల్లోనూ ప్రాథమిక వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటుచేస్తోందని తెలిపారు సీఎం. వైద్యసదుపాయాల విషయంలో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం పాలైతే మండలం, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. పల్లె దవాఖానాలను వస్తే.. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది.
సిరిసిల్లలో చెరువునే మినీ ట్యాంక్ బండ్‌గా మార్చిన అధికారులు.. క్యూ కడుతున్న జనం
హైదరాబాద్‌తో పాటు ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనిలో భాగంగా 2,679 కోట్ల రూపాయల వ్యయంతో అల్వాల్, ఎల్.బి.నగర్, సనత్ నగర్, గచ్చిబౌలీలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళను నిర్మిస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు వైద్య విద్యనందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. 16 స్పెషాలిటీలు, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పి.జి కోర్సులు, నర్సింగ్, పారమెడికల్ కోర్సుల్లో విద్యనందిస్తారు. నిమ్స్ హాస్పిటల్లో మరో రెండువేల పడకలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా నిమ్స్‌లో మొత్తం 3,489 పడకలు అందుబాటులోకి వస్తాయి.
Telangana Formation Day: మన ఎనిమిదేళ్ల తెలంగాణ.. దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్
పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలకు నేడు దేశవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు, ఆదరణ లభిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు పర్యాయాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పదిగ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం గర్వకారణమని చెప్పుకొచ్చారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరంగా నిర్వహిస్తోందని.. మరో దఫా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే భవిష్యత్ తరాలు శరీర దారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని గ్రామాలలో ఇవాళ్టి నుంచే క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Telangana Formation Day, Trs