Home /News /telangana /

TELANGANA FOREST DEPARTMENT GIVES NOTICE TO JAMUNA HATCHERIES FOR ILLEGAL TREE CUTTING VRY

Eetala Rajender : ఈటల కంపనీకి మరో షాక్.. 237 చెట్లను నరికారంటూ...అటవీశాఖ నోటీసులు..!

 ఈటల కంపనీకి మరో నోటీసు.. 237 చెట్లను నరికారంటూ...అటవీశాఖ  నోటిసులు..!

ఈటల కంపనీకి మరో నోటీసు.. 237 చెట్లను నరికారంటూ...అటవీశాఖ నోటిసులు..!

Eetala Rajender : ఈటల రాజేందర్‌కు చెందిన జమున హెచరీస్‌కు రోడ్డు వేయడంలో భాగంగా అనుమతులు లేకుండా చెట్లను నరికారని అటవీశాఖ ఆ కంపనీకి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో సమాధానం చెప్పకపోతే వాల్ట చట్టం కేసు పెడతామని నోటిసుల్లో పేర్కోన్నారు.

ఇంకా చదవండి ...
    అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతోంది. ఒక్కసారి అధికారం కోల్పోయినా..మరే ఇతర కారణలతో ప్రత్యర్థిగా మారినా సీను వేరే విధంగా ఉంటుంది. అధికారం అనే శత్రువు ఎప్పుడు పంజా విసురుతామా అనే వేచి చూస్తారు. ఇలాంటివి రాజకీయాల్లో మాములుగానే ఉంటాయి.

    అయితే ఇక్కడ అధికార వ్యవస్థ సైతం నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం నుండి బయటకు వెళ్లిపోగానే మరోక లాగా వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్న సదరు నాయకుడు ఏం చేసిన అసలు పట్టించుకోరు..తమ కళ్ల ముందే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా..మనకెందుకు అన్నట్టు వ్యవహరిస్తారు.
    కాని ఒక్కసారి రాజకీయా నాయకుల అధికారం కోల్పోయిన తర్వాతా అదే అధికారులు తిరిగి జడలు విప్పుతారు.సంవత్సరాల క్రితం జరిగిన చట్టవ్యతిరేక తప్పులకు ఇప్పుడు సమాధానం చెప్పమంటారు.

    తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహరంపై కూడ ఇదే జరుగుతుంది. ఈటల రాజేందర్ కుటుంభ సభ్యుల పేర జమున హెచరీస్‌కు అటవీశాఖ ఇప్పుడు నోటీసులు పంపింది. జమున హెచరీస్‌కు రోడ్డు వేసేందుకు చెట్లను నరికారాని అందులో పేర్కోంది. అనుమతి లేకుండా సుమారు 237 చెట్లను నరికారని నిర్ధారించింది. అందుకు గాను ఇప్పుడు సమాధానం చెప్పాలని నోటిస్‌లో అడిగింది.

    దీంతో వారి నుండి సరైన సమాధానం రాకపోతే వాల్టా చట్టం క్రింద కేసులు పెడతామని నోటిసులో పేర్కోన్నారు. ఈటల రాజేందర్ భూకబ్జా అరోపణలపై విచారణ జరుపుతున్న అటవిశాఖ ఇన్నాళ్లకు చెట్లను నరికారని నోటిసులు జారీ చేసింది. కాగా నోటీసులకు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కోంది. ఇక వాల్టా చట్టం ప్రకారం నరికిన చెట్లకు రెట్టింపు చెట్లను నాటడడం తోపాటు నరికిన చెట్లకు విలువను కట్టి ఇవ్వాల్సి ఉంటుంది.

    మరోక ముఖ్య విషయం ఏమిటంటే జమున హచరీస్ అటవీశాఖకు సంబంధించిన భూములు కబ్జాకు గురి చేయలేదని అధికారులు తెలిపారు. హెచరీస్ నుండి వంద మీటర్లు దూరంలో అటవీ భూములు ఉన్నాయని తెలిపింది. మరి చెట్లను నరికినందుకు ఎలాంటీ కేసులు పెట్టి ఎంత జరిమానా వేస్తారో వేచి చూడాలి.

    కాగా ఇటివలే శామీర్‌పేట్ మండలంలో ఓ రియల్ ఎస్టేట్ కంపనీ నిబంధనలకు విరుద్దంగా చెట్లను నరికి ప్లాట్లను చేసినందుకు ఆ కంపనీకి ఇరవై లక్షల రూపాయల జరిమాన విధించింది. దీంతోపాటు నరికిన చెట్లకు బదులుగా రెట్టింపు చెట్లను పెట్టే విధంగా సంబంధిత కంపనీ నుండి హామీ తీసుకుంది. దీంతో ఈటల కంపనీలపై ఎలాంటీ పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి .
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Eetala rajender, Forest, Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు