Home /News /telangana /

TELANGANA FISHERIES DEPARTMENT GOVERNMENT LAND GRAB AT NIZAMABAD KNOW DETAILS NZB EVK

Telangana : మ‌త్స్యశాఖ భూమి.. మందిపాలు.. నిజామాబాద్‌లో ప్ర‌భుత్వ భూమి క‌బ్జాయ‌త్నం

నిజామాబాద్ మ‌త్స్య శాఖ కార్యాల‌యం

నిజామాబాద్ మ‌త్స్య శాఖ కార్యాల‌యం

Telangana : రాష్ట్రంలో ప్ర‌భుత్వ భూమి (Govt Land) క‌నిపిస్తే చాలు కొందరు క‌బ్జాదారులు ద‌ర్జాగా ఆక్ర‌మిస్తున్నారు. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా రూ.కొట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లా (Nizamabad Dist.) కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయానికి చెందిన భూమి కాజేసేందుకు కబ్జాదారులు విఫలయత్నం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
                 - పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్‌, న్యూస్‌18 తెలుగు
  రాష్ట్రంలో భూ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు భూమి కొనాలంటే ధ‌ర‌లు మండిపోతున్నాయి. దీంతో ప్ర‌భుత్వ భూమి (Govt Land) క‌నిపిస్తే చాలు కొందరు క‌బ్జాదారులు ద‌ర్జాగా అక్ర‌మిస్తున్నారు. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా రూ.కొట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లా (Nizamabad Dist.) కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయానికి చెందిన భూమి కాజేసేందుకు కబ్జాదారులు విఫలయత్నం చేస్తున్నారు. ప్ర‌భుత్వానికి చెందిన ఎకరం స్థలం కాజేసేందుకు దొంగ సర్వే నంబర్లు సృష్టించి ఆ స్థలం తమదేనంటూ కోర్టుకు వెళ్లారు. జిల్లా కోర్టు (District Court)రెండుసార్లు మత్స్యశాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా క‌బ్జాదారుల తీరు మాత్రం మార‌డం లేదు.

  ప్రైవేటు ఆక్ర‌మ‌ణ‌లు..
  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో మత్స్యశాఖకు ప్రభుత్వం 6 ఎకరాల 26 గుంటల స్థలం కేటాయించింది. అయితే ప్ర‌స్తుతం 4 ఎకరాల 24 గుంటల స్థలం మాత్రమే మిగిలింది. మత్స్యశాఖ కార్యాలయం ఎదురుగా బోధన్‌కు వెళ్లే ప్రధాన రహదారి, చుట్టుపక్కల ఖరీదైన ఇళ్లు, వాణిజ్య స్థలాలు , కొత్త‌గా ఎన్ఆర్ఐ కాల‌నీ ఏర్ప‌డ్డాయి. ఈ స్థలంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం, ఫిషరీస్‌ ఆధికారి కార్యాలయాలు ఉన్నాయి. మ‌రోవైపు చేపలు పెంచేందుకు నాలుగు పెద్ద ఫిష్‌ పాండ్స్‌ కూడా ఏర్పాటు చేశారు.

  Huzurabad Bypoll: ఈటల, రేవంత్ రెడ్డి రహస్య భేటీ.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు


  గ‌తంలో చేప పిల్లలు ఇక్కడే పెంచేవారు. అయితే నీటి ఎద్దడి కారణంగా చేప పిల్లలు పెంపకం నిలిపివేయడంతో అవి శిథిలావస్థకు చేరాయి. కార్యాలయం వెనుక భాగం కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో ఈ స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తోంది. సర్వే నెంబర్‌ 2848, 2849లలో 4ఎకరాల 24 గుంటల స్థలం ఉంది. అందులో సర్వే నెంబర్‌ 2848లో ఒక ఎకరం 11 గుంటలు, సర్వే నెంబర్‌ 2849లో 3ఎకరాల 13 గుంటల స్థలం ఉంది.

  పది సంవత్సరాల కాలంలో ఆ భూమి పక్కనే ఎన్ఆర్ఐ కాల‌నీ ఏర్పడడంతో భూముల ధరలకు రెక్క‌లొచ్చాయి. ప్ర‌స్తుతం ఆ భూమికి కోట్లలోకి మారింది. దీంతో సర్వే నంబర్ ఆధారంగా ప్రైవేట్ భూముల పేరిట అక్రమాలు పెరిగాయి. గతంలో ఎనిమిది ఎకరాలు ఉండగా అందులో ఆరు ఎకరాలు మాత్రమే ప్రస్తుతం మ‌త్స్య శాఖ అధీనంలో ఉంది. అయితే ప్ర‌స్తుతం ఒక ఎకరం నాలుగు గంటల భూమిపై వివాదం నెల‌కొంది.

  అగ్ని ప్ర‌మాదంలో ఫైల్స్ ద‌గ్ధం
  2009లో నిజాంబాద్ రెవెన్యూ కార్యాలయం (Revenue Office) లో అగ్నిప్రమాదం జ‌రిగి ప‌లు ఫైల్‌లు దగ్ధమయ్యాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎకరం నాలుగు గంటల భూమి 2848 సర్వే నంబర్లు ఉండగా కొందరు వ్యక్తులు సర్వే నెంబర్లు భూమి యజమానులు మేమే అని ముందుకు వచ్చారు. అందులో కోళ్ల ఫారం, ఆయిల్ మండలం పహానిలలోకి ఎక్కించారు. కానీ ఆ భూమి వాస్తవానికి దశాబ్దకాలంగా మ‌త్స్య‌శాఖ ఆధీనంలోనే ఉంది. ఈ స్థలంలో అహ్మద్‌, షాజహానా బేగం అనే వారు 23 గుంటల స్థలం తమదేనని జిల్లా కోర్టును ఆశ్రయించారు. వీరి వాద‌న‌లను కోర్టు కొట్టివేసింది. వారు సెషన్‌ కోర్టు (Session Court) కు వెళ్లినా తప్పుడు డాక్యుమెంట్లు (Documents) సృష్టించారని కేసు కొట్టివేస్తూ ఈ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిం చాలని ఆదేశించారు.

  కోర్టు చుట్టూ మ‌త్స్య‌శాఖ అధికారులు..
  ప్రహరీ సగం మాత్రమే నిర్మించి వదిలివేశారు. దీంతో కబ్జాదారులు తరచూ ఈ స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని అధికారులు, పోలీసులు తొలగిస్తున్నా మళ్లీమళ్లీ అదే పని చేస్తున్నారు. మత్స్యశాఖకు చెందిన భూమిని సర్వే చేయాలని అధికారులు ఏడీ జిల్లా సర్వేయర్‌ (Dist. Surveyor)ను కోరారు. అయితే 2019న‌వంబ‌ర్ ఒక‌టిన‌ జిల్లా సర్వేయర్‌, మండల సర్వేయర్‌లు కలిసి సర్వే చేసి 4 ఎకరాల 24 గుంటల స్థలం మత్స్య శాఖకు చెందినదేనని నివేదిక ఇచ్చారు. కోర్టులో కేసు విచారణకు మత్స్యశాఖ అధికారులు హైకోర్టు (High Court) చుట్టూ తిరుగుతున్నారు.

  Minister Harish: అబద్ధాల పునాదుల మీద మభ్య పెట్టి ఓట్లు పొందాలని చూస్తున్నరు: మంత్రి హరీష్ ఫైర్


  స‌ర్వేయ‌ర్ స‌స్పెండ్‌..
  కబ్జాదారులు నార్తు మండల సర్వేయర్‌ (Mandal Surveyor)  అరుణకు తమ భూమి చూపించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అప్పటి నార్త్ మండల సర్వేయర్‌ అరుణ 2020 జులై 23న‌ జిల్లా మత్స్యశాఖ అధికారులు లేకుండానే సర్వేచేసి కబ్జాదారులకు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. ఈ నివేదికపై ఎఫ్‌డీవో కలెక్టర్‌ (FDO Collector) దృష్టికి తీసుకెళ్ళారు.. దీంతో విచారణ జరిపి సర్వేయర్‌ను సస్పెండ్‌ చేశారు. కేసు కోర్టులో విచారణ సాగుతోంది. రెండోసారి సర్వేచేసి నివేదిక ఇచ్చిన సర్వేయర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అయినా మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నారు.

  మ‌ళ్లీ క‌బ్జాకు య‌త్నం..
  ఈ నెల 18న తెల్లవారు జామున ఉదయం 4గంటలకు కొందరు రాళ్లు, సిమెంట్‌ పిల్లర్లు సదరు స్థలంలో పాతే ప్రయత్నం చేశారు. వాచ్‌మన్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అడ్డుచెప్పడంతో ఆయనను బెదిరించారు. ఆయన వెంటనే ఏడీ ఆంజనేయస్వామికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి వచ్చిన ఎఫ్‌డీవో (FDO)ను వెంటనే వెళ్లిపోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆయన కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌లకు సమాచారం అందించారు. షకీర్‌ఖాన్‌, ఫైజల్‌ఖాన్‌ అనే వ్యక్తులు సదరు స్థలంలో రాళ్లు, సిమెంట్‌ పిల్లర్లు నాటేందుకు యత్నించారు. ఘటనాస్థలికి వెళ్లాలని అదనపు కలెక్టర్‌ పోలీసులకు ఆదేశించడంతో 1వ పట్టణ ఎస్‌హెచ్‌వో (SHO), తమ సిబ్బందితో వెళ్లి కబ్జాదారులను వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. అయితే వారు తమ స్థలంలో పనులు చేసుకుంటే అడ్డుకున్నాడని ఎఫ్‌డీవోపై ఫిర్యాదు చేశారు.

  Huzurabad: హుజురాబాద్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాక పుట్టించే కామెంట్స్


  వారి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపమని గంట సమయం ఇచ్చినా వారు స్పందించలేదు. దీంతో మత్స్యశాఖ స్థలంలో కబ్జాకు యత్నిస్తున్నారని ఎఫ్‌డోవో ఆంజనేయస్వామి 1వ పట్టణ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

  మంత్రి దృష్టికి విష‌యం..
  మత్స్యశాఖ స్థలం కబ్జాకు యత్నిస్తున్న విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) ఎఫ్‌డీవో ఆంజనేయస్వామిని బుధవారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో చట్టం ప్రకారం ముందుకెళ్లాలని మంత్రి సూచించినట్లు ఎఫ్‌డీవో తెలిపారు. కబ్జా దారుల‌పై కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కూడా వివరించాం. చట్టప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కానివ్వమ‌ని ఎఫ్‌డీవో అన్నారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Land mafia, Nizamabad District, Telangana

  తదుపరి వార్తలు