హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణలో మత్య్స విప్లవం... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్...

తెలంగాణలో మత్య్స విప్లవం... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్...

తెలంగాణలో చేపల ఉత్పత్తి (Image : Twitter / KTR)

తెలంగాణలో చేపల ఉత్పత్తి (Image : Twitter / KTR)

Telangana Fisheries : చేపల చెరువులకు కళ తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం... మత్య్స విప్లవం సృష్టిస్తోంది. ఏటా ఉత్పత్తిని పెంచుతూ... తన రికార్డులను తనే బద్ధలు కొడుతోంది.

ఒకప్పుడు తెలంగాణలో చెరువులు... నామమాత్రంగా ఉండేవి. ఉన్న చెరువుల్లో చేపల పెంపకం అనేది చాలా తక్కువ. మరి ఇప్పుడో... మిషన్ కాకతీయ ద్వారా 45 వేల చెరువులకు జలకళ వచ్చింది. ఫలితంగా చేపల పెంపకం ఒక రెగ్యులర్ ఉపాధిగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో 21,500 చెరువుల్లో చేపల పెంపకం జరుగుతోంది. ప్రతి 4 నుంచీ 6 నెలలకోసారి భారీ చేపలు ఉత్పత్తవుతున్నాయి. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తెలంగాణ మత్స్యకారులపై ప్రశంసలు కురిపించారు. మొదటిసారిగా చేపల ఉత్పత్తి 3 లక్షల టన్నులకు చేరిందంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాట్లు, ఉచిత చేప పిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయాల వంటివి ఈ ఘనత సాధించేందుకు వీలు కల్పించాయని ట్వీట్‌లో తెలిపారు కేటీఆర్.
తెలంగాణలో చేపలతోపాటూ... రొయ్యల పెంపకం కూడా జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 35 చెరువులు, రిజర్వాయర్లలో మంచినీటి రొయ్యలను పెంచుతున్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) నుంచి రూ.1000 కోట్ల రుణం తీసుకొని... సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని (IFDS) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికింద 75 నుండి 90 శాతం రాయితీపై మత్స్యకారులకు వాహనాలు, వలలు, కాంటాలు, ఐస్‌బాక్సులు వంటి వాటిని ఇస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.6 లక్షల ప్రమాద బీమా ఇస్తోంది.


telangana fisheries,telangana news,telangana government,telangana fisheries development,telangana fishermen,fisheries development in telangana,telangana news latest,telangana updates,తెలంగాణ చేపల పెంపకం, తెలంగాణలో చేపల ఉత్పత్తి, కేటీఆర్ ట్వీట్,
తెలంగాణలో చేపల ఉత్పత్తి (Image : Twitter / KTR)


2015-16 సంవత్సరంలో 2,28,185 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. 2016-17లో 1,93,732 టన్నులు... 2017-18లో 2,62,252 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. 2018-19 కాలంలో డిసెంబర్-18 నాటికి 2,25,826 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. 2019 జూన్ మొదటి వారంలో 3 లక్షల టన్నుల లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇలా ఐదేళ్లలో తెలంగాణ చెరువులు, రిజర్వాయర్ల నుంచి 10 లక్షల టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి అయ్యాయి. లక్షల మంది మత్య్సకారులు ప్రయోజనం పొందారు.

First published:

Tags: Kcr, KTR, Telangana News, Telangana updates

ఉత్తమ కథలు