హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By Poll: జోరు వానలో...దుబ్బాకలో మంత్రి హరీష్ రావు వరాల జల్లు...

Dubbaka By Poll: జోరు వానలో...దుబ్బాకలో మంత్రి హరీష్ రావు వరాల జల్లు...

జోరు వానలో...దుబ్బాకలో మంత్రి హరీష్ రావు వరాల జల్లు...శంకుస్థాపనలతో బిజీ..

జోరు వానలో...దుబ్బాకలో మంత్రి హరీష్ రావు వరాల జల్లు...శంకుస్థాపనలతో బిజీ..

దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికల రాజకీయం ఉపందుకుంది. తాజాగా సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.

ఇంకా చదవండి ...

    దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికల రాజకీయం ఉపందుకుంది. తాజాగా సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో ఆర్అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణాలకు రూ.12 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ బావుల కరెంటు మోటర్లకు మీటర్లు బిగింపు చేపట్టేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయిస్తున్నదని, కేంద్రం బీజేపీ ప్రవేశ పెట్టనున్న బిల్లును వ్యతిరేకిస్తూ దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. రూ.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీడీ కార్మికుల ఖార్కనా భవనానికి MP కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమం కోసం కృష్జి చేస్తున్న ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు.

    దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామంలో రూ.7 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు, రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గోదామును మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో గృహాలు ఉన్న స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరిపేలా జిల్లా కలెక్టర్ కు సూచించనున్నట్లు మంత్రి తెలిపారు. రూ.33 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ.8 లక్షలు వెచ్చించి అదనపు పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనాయపల్లిలో రూ.20 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టనున్న నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన స్థాపన చేశారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Harish Rao

    ఉత్తమ కథలు