ఆంధ్రా బ్యాంక్ విలీనంపై మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు దగ్గరైన ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంకు‌లో విలీనమై కానరాకుండా పోవడం తనను తీవ్రంగా బాధిస్తోందని అన్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 3, 2019, 2:04 PM IST
ఆంధ్రా బ్యాంక్ విలీనంపై మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రా బ్యాంకు విలీనంపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు
  • Share this:
ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు దగ్గరైన ఈ బ్యాంక్ యూనియన్ బ్యాంకు‌లో విలీనమై కానరాకుండా పోవడం తనను తీవ్రంగా బాధిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఆంధ్రా బ్యాంక్ కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. గురువారం బీఆర్‌కే భవన్‌లో ఆంధ్రా బ్యాంక్ సెక్రటేరియట్ బ్రాంచీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రా బ్యాంక్ మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఎక్కువ శాతం తెలుగు ప్రజల అకౌంట్లు ఈ బ్యాంకులోనే ఉన్నాయని, ఎక్కువ శాతం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు.

ఆంధ్రా బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని, దానికోసం ప్రభుత్వం తరఫున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ప్రజలకు, రైతులకు మరింత సేవల చేయాలని బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌కే భవన్‌లో సచివాలయం శాఖను ఏర్పాటు చేసినందుకు గానూ బ్యాంకు సిబ్బందికి మంత్రి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు