Home /News /telangana /

TELANGANA FARMERS SET FIRE TO GRAIN IN KAMAREDDY MS NZB

Telangana: సన్న ధాన్యం కొనడం లేదని రైతుల ఆగ్రహం.. రోడ్డుపైనే ధాన్యానికి నిప్పు..

ధాన్యాన్ని తగులబెడుతున్న  రైతులు

ధాన్యాన్ని తగులబెడుతున్న రైతులు

ఆరుగాలం శ్రమించిన రైతు కడుపు మండుతున్నది. సర్కారు మాట విని.. పంట పండించినా దానికి మద్దతు ధర కల్పించకపోవడం.. మద్దతు ధర లేకున్నా సరే నష్టానికైనా అమ్ముకుందామనుకుంటే దానికి కూడా మోకాలడ్డుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • News18
  • Last Updated :
    ఆరుగాలం శ్రమించిన రైతు కడుపు మండుతున్నది. సర్కారు మాట విని.. పంట పండించినా దానికి మద్దతు ధర కల్పించకపోవడం.. మద్దతు ధర లేకున్నా సరే నష్టానికైనా అమ్ముకుందామనుకుంటే దానికి కూడా మోకాలడ్డుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నవడ్లు పండించినా.. ప్రభుత్వం మాత్రం వాటిని తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని మల్లయ్య పల్లి కొనుగోలు కేంద్రం లో రైతులు సన్న ధాన్యం కాంట చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. ధాన్యం బస్తాలను రోడ్డు మీదే పారబోసి దానికి నిప్పంటించారు.

    మల్లయ్య పల్లి కొనుగోలు కేంద్రం లో.. లారీ కి ఎనిమిది బస్తాల తరుగు తీసుకున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. అనంతరం ఎల్లారెడ్డి-మెదక్ ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు బైఠాయించారు. మూడు ధాన్యం బస్తాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
    ఘటనా స్థలానికి ఇంచార్జ్ ఎమ్మార్వో స్వామి చేరుకొని రైతులతో మాట్లాడారు.

    ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు..


    రైతుల డిమాండ్ మేరకు.. కొనుగోలు కేంద్రానికి వెంటనే లారీలను రప్పించి ధర్నా ను విరమింపచేశారు. అనంతరం డిఎస్ఓ కొండలరాయుడు చేరుకొని రైస్ మిల్లులను పరిశీలించారు. మిల్లులకు వచ్చిన లారీలలో ధాన్యం బస్తాల కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎంఆర్ఓ స్వామి ఎయిర్ ఫోర్స్ మెంట్ డిటి శ్రీకాంత్ ఉన్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Farmers, Farmers Protest, Kamareddy, Telangana

    తదుపరి వార్తలు