వారణాసిలో మోదీపై పోటీ చేసే రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలా?

నిజామాబాద్ జిల్లా ఎర్గాట్ల మండలానికి చెందిన ఇస్తారి అనే రైతు నామినేషన్‌ను మాత్రమే ఎన్నికల అధికారులు ఆమోదించారు.

పసుపు బోర్డు రావాలంటే నిజామాబాద్‌లో కాదని, వారణాసిలో నరేంద్ర మోదీ మీద పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. దీంతో వారణాసిలో మోదీపై పోటీ వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని అరవింద్ ఆరోపిస్తున్నారు.

 • Share this:
  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేస్తున్న రైతులపై బీజేపీ నేత డి.అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. మోదీపై పోటీ చేసే వారు టీఆర్ఎస్ కార్యకర్తలని ఆరోపించారు. ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సుమారు 50 మంది రైతులు మోదీపై పోటీకి రెడీ అయ్యారు. వారు వారణాసి కూడా వెళ్లారు. మొత్తం 50 మంది వరకు పోటీ చేస్తామని ప్రకటించిన పసుపు రైతులు.. అందులో పది మంది పేర్లను ముందస్తుగా వెల్లడించారు. అయితే, ఆ పది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అరవింద్ ఆరోపించారు. ఆ పది మంది తెలంగాణ పసుపు రైతల సంఘంలో సభ్యులు అయినప్పటికీ, ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉందన్నారు. వారిలో కొందరు రైతులు కారని, కనీసం భూమి కూడా లేదని చెప్పారు. ది న్యూస్ మినిట్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

  భర్త అనిల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత


  మొదటిదశ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత మీద వారంతా పోటీకి దిగారు. అయితే, ఆ సమయంలో కవిత కూడా ఇలాగే ఆరోపించారు. వారంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులని ఆరోపించారు. పసుపు బోర్డు రావాలంటే నిజామాబాద్‌లో కాదని, వారణాసిలో నరేంద్ర మోదీ మీద పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. దీంతో వారణాసిలో మోదీపై పోటీ వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని అరవింద్ ఆరోపిస్తున్నారు.

  డి. అరవింద్


  పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పసుపు రైతులకు తమిళనాడు రైతులు కూడా మద్దతు పలికారు. తమిళనాడుకు చెందిన రైతులు కూడా మోదీపై పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో వారణాసిపై దేశవ్యాప్త చర్చ జరుగుతుందని, ఆ రకంగా తమ సమస్యలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయని రైతులు ఆశిస్తున్నారు. సమస్యను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పడమే తమ ఉద్దేశం కానీ, రాజకీయంగా ఎలాంటి దురుద్దేశాలు లేవని రైతులు స్పష్టం చేస్తున్నారు.
  First published: