Telangana : యాభై ఎక‌రాలు లాక్కున్నారు.. ప‌రిహారం ఇవ్వ‌ట్లేదు.. ఆత్మహత్యకు అనుమ‌తివ్వండి రైతు ఆవేద‌న‌

ఖ‌మ్మం జిల్లా రైతు

Telangana : ఖ‌మ్మం జిల్లాలో సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు ఓ రైతు వ‌ద్ద నుంచి 50 ఎక‌రాలు సేకిరించింది. భూ సేక‌ర‌ణ చేసి నాలుగేళ్లు గ‌డుస్తున్నా ప‌రిహారం అందించలేదు. దీంతో 1439 రోజులుగా దీక్ష చేస్తున్నా ప‌ట్టంచుకొనే నాథుడులేడు. దీంతో అల‌సిపోయిన రైతు ఆత్మ‌హ‌త్య‌కు అవ‌కాశం ఇవ్వండి అని క‌లెక్ట‌ర్‌ను వేడుకొంటున్నాడు.

 • Share this:
  నీ చేలో బొగ్గుంది.. నీ భూమి తీసుకుంటున్నామంటూ ఓ రైతు భూమిని లాక్కున్నారు అధికారులు.. .ఇది జరిగి నాలుగేళ్లు గ‌డిచింది.. అయినా ఇప్పటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. అదేదో తీసుకున్నది ఎకరమో అరెకరమోలే అంటే అదీ కాదు. ఏకంగా ఏభై ఎకరాలు. ఉన్నదంతా తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంతో ఇప్పుడా రైతు.. ఆయన కుటుంబం వీధిన పడింది. ఏభై ఎకరాల పొలంలో ధీమాగా బతికిన ఆ రైతు ఇప్పుడు అదే ఊళ్లో రోజువారీ కూలీగా బతుకీడుస్తున్నాడు. తప్పెవరిది.. బాధ్యులు ఎవరన్నది పక్కన పెడితే.. తన భూమికి న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ ఆ రైతు దీక్ష చేపట్టి ఇప్పటికి 1439 రోజులైంది. అయినా పట్టించుకున్న నాధుడు లేడు. దీంతో ఆత్మ‌హ‌త్య‌కు అవ‌కాశం ఇవ్వండి అని రైతు క‌లెక్ట‌ర్‌ను వేడుకొంటున్నాడు.

  1439 రోజుల నుంచి దీక్ష‌..
  ఖ‌మ్మం జిల్లాలో సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు రైతు సుందర్‌లాల్ నుంచి 50 ఎక‌రాల భూమిని సేక‌రించింది. ఈ సేక‌ర‌ణ నాలుగేళ్ల క్రిత‌మే చేసింది. ఇప్ప‌టికీ ఆ రైతుకు భూమికి సంబంధించిన ప‌రిహారం మాత్రం అందించ‌లేదు. దీంతో రైతు ఆందోళ‌న చేప‌ట్టాడు. 1439 రోజుల నుంచి త‌నుకున్యాయం చేయాలిని కోరుతూ దీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాడు.

  Huzurabad by Election 2021: హుజూరాబాద్‌కు భారీగా పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు.. 3000 మంది పోలీసులతో ప‌హారా


  న్యాయ ప‌రంగా అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించాడు. ప‌లు చోట్ల రిప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చాడు. ఎక్క‌డా కూడా న్యాయం జ‌ర‌గ‌లేదు. దీంతో రైతు ఆశ కోల్పోయాడు.

  క‌లెక్ట‌ర్ దృష్టికి..
  న్యాయం కోసం తాను తొక్కని గడప లేదు. మొక్కని అధికారి లేడని చెప్పుకుంటూ తనకు కనీసం చనిపోడానికైనా అనుమతి మంజూరు చేయండంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతంకు తన గోడును వెల్లబోసుకున్నాడు ఆ రైతన్న. విస్తుపోయిన కలెక్టర్‌ గౌతమ్‌ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ఆయనకు ధైర్యం చెప్పారు.

  లోపించిన బాధ్య‌త‌..
  ప్రభుత్వం ప్ర‌జా అవ‌సాల కోసం భూసేకరణ చేసే అధికారం ఉపయోగించి ప్రవేటు వ్యవసాయ భూములను సేకరిస్తుంటుంది. దీనికోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఏ ప్రాంతంలో ఏ అవసరం కోసం ఏఏ సర్వే నెంబర్లలోని భూమిని ఎంత మేర తీసుకోవాలని భావిస్తున్నారో స్పష్టంగా పేర్కొంటారు. అభ్యంతరాలను స్వీకరించాలి. వాటిపై భూమికి సంబంధించిన రైతులతో చర్చించాలి. ప్రభుత్వం ఇవ్వజూపిన పరిహారం విషయంలో భూమి కోల్పోతున్న రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై చర్చించాలి. వారు ఒప్పుకున్నాకే డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ ప్రచురించాలి. ఆ తర్వాతే భూమిని తీసుకుని సదరు అవసరాల కోసం వాడుకోవాలి. ఈ క్రమంలో ఎక్కడా భూసేకరణ చట్టంలోని నిబంధలను ఉల్లంఘించరాదు. కానీ చట్టంలో పేర్కొన్న ఏ రక్షణలనూ అధికారులు పాటించరు. సరికదా దౌర్జన్యంగా భూమిలోకి వచ్చేసి ఆక్రమించుకుంటున్న దాఖలాలు ఎన్నో. కాస్త అవగాహన ఉన్న వాళ్లు కోర్టులకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేసినా.. అది అందేసరికి పరిస్థితి చేయిదాటిపోయిన దాఖలాలు ఎన్నో. ఇక్కడా అదే జరిగింది.

  - జి.శ్రీ‌నివాస్‌, ఖ‌మ్మం, న్యూస్‌18తెలుగు

  Published by:Sharath Chandra
  First published: