రైతుబంధు సాయం రాలేదని ప్రాణం తీసుకున్న రైతు

రైతుబంధు పథకం కింద వచ్చే పెట్టుబడి సాయం అందలేదని.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడో రైతు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామలో చోటుచేసుకుంది

news18-telugu
Updated: February 10, 2019, 7:56 AM IST
రైతుబంధు సాయం రాలేదని ప్రాణం తీసుకున్న రైతు
నమూనా చిత్రం
  • Share this:
రైతుబంధు పథకం కింద వచ్చే పెట్టుబడి సాయం ఓ రైతుకు అందలేదని.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంతారం ఈర్‌రెడ్డి(52) రైతుకి సత్యగామలో 8.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు పండకపోవడంతో ఆ రైతు తన కుటుంబ సభ్యులతో  హైదరాబాద్‌లోని బేగంపేటలో కూలి పనులు చేసుకుంటున్నాడు.  అయితే ఈ రైతు మొదటి విడత రైతుబంధు కింద రూ.32,800 చెక్కు తీసుకున్నాడు. రెండో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉండటంతో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఈ క్రమంలో ఈర్‌రెడ్డి  తన ఇంటి పేరుతో పాటు బ్యాంకు IFSC కోడ్‌ తప్పుగా నమోదవ్వడం వల్ల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దీంతో తన భూమి ఏమైపోతుందోనని ఈర్‌రెడ్డి  దిగులు పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈనెల 7న సత్యగామకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి..  శుక్రవారం ఉదయం సొంత భూమిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
First published: February 10, 2019, 5:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading