Telangana: చెత్త కుప్పలో మరణించిన శిశువు.. శరీర భాగాలను పీక్కుతిన్న పందులు.. దుర్వాసన రావడంతో..

ప్రతీకాత్మక చిత్రం

మరణించిన శిశువును ఖననం చేయకుండా.. చెత్త కుప్పలో పడేసిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

 • Share this:
  రానురాను సమాజంలో అమానవీయ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఓ కుటుంబం మరణించిన ఆడ శిశువును ఖననం చేయకుండా చెత్తకుప్పలో పడేశారు. అయితే దీనిని ఎవరూ గమనించకపోవడంతో.. ఆ శిశువు పందులకు ఆహారమైంది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మళ్లీ గర్భం దాల్చడంతో మూడో సంతానం మగపిల్లవాడు పుడతాడా అని ఆశించారు. గర్భిణీ మార్చి 29న ఇంట్లో బాత్రూంకి వెళ్ళిన సందర్భంగా జారి కింద పడి పోవడం తో కడుపు నొప్పి రావడంతో వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్ నగర్ జర్నల్ ఆస్పత్రికి సిఫార్స్ చేశారు. వైద్యులు వెంటనే స్కానింగ్ ఇతరత్రా పరీక్షలు చేసి గర్భంలో నుంచి శిశువు మృతి చెంది కడుపులోకి వచ్చినట్లు గుర్తించారు ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ప్రమాదం అని సిజేరియన్ చేసి ఆడశిశువును బయటకు తీసి ఆమె తల్లి భర్తకు వైద్యులు అప్పజెప్పారు.

  బాలింతను ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. శిశువును కుటుంబ సభ్యులు ఖననం చేయకుండా ఆసుపత్రి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మురుగు కాలువ అ పక్కనే చెత్త కుప్పలు పడేశారు. ఆ శిశువును శరీర భాగాలను రెండు రోజులుగా పందులు తినేశాయి. అయితే చెత్తకుప్ప నుంచి దుర్వాసన వస్తుండడంతో అక్కడికి వెళ్లి చూడగా అందులో శిశువు శరీర భాగాలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందడంతో.. శిశువు శరీర భాగాలను ఆసుపత్రికి మార్చరీకి తరలించారు. చేతికి ఉన్న ఆసుపత్రి ట్యాగ్ పరిశీలించిన సిబ్బంది ఆసుపత్రి డాక్టర్ రామ్ కిషన్ కు సమాచారం ఇవ్వగా ట్యాగ్ పై ఉన్న నెంబరు ఆధారంగా ఆస్పత్రిలో ప్రసవాల కె షీట్ పరిశీలించి రెండు రోజుల కిందట జన్మించిన ఆడశివుగా తెలిపారు.

  దీని ఆధారంగా శిశువు తల్లిదండ్రులను గుర్తించారు. శిశువు తండ్రిని పిలిచి మందలించారు. అనంతరం మిగిలిన శిశువు శరీర భాగాలను ఖననం చేయాల్సిందిగా సూచించి.. వాటిని అతడికి అందజేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: