మద్యం ధరలను అందుకే పెంచాం... తెలంగాణ ఎక్సైజ్ మంత్రి

లాక్‌డౌన్‌ సమయంలో పలు ప్రాంతాల్లో గుడుంబా తయారీ పెరిగిపోయిందని..తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్.

news18-telugu
Updated: May 6, 2020, 4:38 PM IST
మద్యం ధరలను అందుకే పెంచాం... తెలంగాణ ఎక్సైజ్ మంత్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
42 రోజుల తర్వాత తెలంగాణలో లిక్కర్ షాపులు తెరచుకోవడంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బీర్లు, లిక్కర్ కోసం భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద పరిస్థితిపై తెలంగాణ ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైన్ షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పక్క రాష్ట్రంలో 75శాతం వరకు లిక్కర్ ధరలను పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే మన రాష్ట్రంలోనూ ధరలను పెంచినట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

తెలంగాణలో మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదు. అన్ని షాపుల్లో తగినన్ని నిల్వలు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో 75 శాతం వరకు మద్యం ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచాం. మన రాష్ట్రంలో సగటున 16శాతం మేర మాత్రమే ధరలు పెరిగాయి. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా షాపుల యజమానులు చర్యలు తీసుకోవాలి. మాస్కులు లేని వారికి మద్యం విక్రయించరాదు.
శ్రీనివాస్ గౌడ్


తెలంగాణ మంత్రికి షాక్... పెళ్లిలో చేతి కడియం మాయం | Srinivas goud sentiment kadiyam missed in marriage function ak
శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మంత్రి

లాక్‌డౌన్‌ సమయంలో పలు ప్రాంతాల్లో గుడుంబా తయారీ పెరిగిపోయిందని..తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక చీప్ లిక్కర్‌పై 11శాతం ధరలను పెంచిన సర్కార్.. ఇతర మద్యంపై 16శాతం పెంచింది.
First published: May 6, 2020, 4:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading