వైన్‌షాప్స్‌లో ఎక్సైజ్‌శాఖ తనిఖీలు.. లిక్కర్ స్టాక్ లెక్కల్లో తేడాలు

వైన్ షాప్స్‌లో ఆబ్కారీ శాఖ సోదాలు

చాలా వరకు వైన్ షాప్స్‌లో స్టాక్ లెక్కల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. లాక్‌డౌన్‌కు ముందు నిండా సరుకు కనిపించిన దుకాణాల్లో.. ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మద్యం కనిపిస్తోంది.

  • Share this:
    తెలంగాణలో మద్యం అమ్మకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రచారం రేపథ్యంలో మద్యం నిల్వలపై ఎక్సైజ్ శాఖ ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ఏ మేరకు లిక్కర్ బాటిళ్లు ఉన్నాయో పరిశీలించాలని ఎక్సైజ్ స్టేషన్‌ ఇంచార్జీలను ఆబ్కారీ శాఖ ఆదేశించింది. దుకాణాల వారీగా లిక్కర్, బీరు నిల్వలపై సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాప్స్‌లో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. దుకాణాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. లాక్‌డౌన్‌‌కు ముందు ఎంత మందు ఉంది? ప్రస్తుతం ఎంత ఉంది? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.

    ఐతే చాలా వరకు వైన్ షాప్స్‌లో స్టాక్ లెక్కల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. లాక్‌డౌన్‌కు ముందు నిండా సరుకు కనిపించిన దుకాణాల్లో.. ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మద్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం నిల్వలు స్టాక్ పై నివేదిక తయారీకి అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌కు ముందు ఎక్సైజ్ అధికారులు ప్రతి షాప్‌కు వెళ్లి స్టాక్ వివరాలను నమోదు చేశారు. ఆ తర్వాత దుకాణానికి సీల్ వేశారు. కానీ లాక్‌డౌన్ సమయంలో చాలా మంది వ్యాపారులు అక్రమమార్గాల్లో మద్యాన్ని తరలించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించారు. MRPకి మూడింతలు ఎక్కువ ధరకు అమ్మొ సొమ్ముచేసుకున్నారు. ఈ క్రమంలోనే చాలా వైన్ షాప్స్‌లో స్టాక్ మాయమైంది. దీనిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published: