కిక్కే కిక్కు...తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీగా దరఖాస్తులు...

రాష్ట్రంలోని 2,216 మద్యం షాపులకు 41 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.821 కోట్లు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 16, 2019, 10:54 PM IST
కిక్కే కిక్కు...తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీగా దరఖాస్తులు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం మీద అదనపు ట్యాక్స్ విధిస్తూ జీవో జారీ చేసింది.
  • Share this:
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. బుధవారంతో దరఖాస్తుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 2,216 మద్యం షాపులకు 41 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.821 కోట్లు ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 18వ తేదీన లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలను ప్రభుత్వం దరఖాస్తుదారులకు కేటాయించనుంది. అయితే ఈ సారి పెద్ద ఎత్తున తెలంగాణలో మద్యం షాపులను దక్కించుకోవడానికి స్నేహితుల ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులు కూడా టెండర్లు వేసినట్టు తెలుస్తోంది. ఏపీలో కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో తమ వ్యాపార అవకాశాలను ఏపీ మద్యం వ్యాపారులు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది.
First published: October 16, 2019, 10:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading