తెలంగాణ జలదాహం తీర్చే కల్పతరువు ‘కాళేశ్వరం’

Kaleswaram Project | కేసీఆర్ దీక్షగా శ్రమించి సాధించి చూపిన ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్. మరికొద్ది గంటల్లోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ప్రాజెక్టు... ఎప్పుడు తమ పొలాలను గోదావరి నీటితో తడుపుతుందా అని తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: June 20, 2019, 7:30 PM IST
తెలంగాణ జలదాహం తీర్చే కల్పతరువు ‘కాళేశ్వరం’
కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో కేసీఆర్
  • Share this:
తెలంగాణ జలచరిత్రలో అపూర్వఘట్టం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ బీళ్ళను నీటి ఎద్దడి నుంచి కాపాడే అద్భుత ప్రాజెక్ట్ కాళేశ్వరం. కేసీఆర్ దీక్షగా శ్రమించి సాధించి చూపిన ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్. మరికొద్ది గంటల్లోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ప్రాజెక్టు... ఎప్పుడు తమ పొలాలను గోదావరి నీటితో తడుపుతుందా అని తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు. ఇది తెలంగాణ జీవధార. తెలంగాణ దశ, దిశ మార్చాలని భావించిన కేసీఆర్ పట్టుబట్టి రూపుదిద్దిన సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 పంప్ హౌజ్‌లు, 22 ఎత్తిపోతల కేంద్రాలు, 88 పంపులు, 1832 కిలోమీటర్ల జలప్రయాణం... కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యేకత.

నిర్మాణంలోనే అనేక రికార్డ్‌లు కాళేశ్వరం సొంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా లబ్దిపొందే జిల్లా సిద్ధిపేట. మొత్తం 20 కొత్త జిల్లాల ఆయకట్టుకు దీని ద్వారా నీరందుతుంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, జనగామ, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ వరప్రదాయినిగా మారనుంది.

Kaleswaram project, telangana latest news, cm kcr, harish rao, medigadda barrage, sundilla barrage, annaram barrage, mallanna sagar, kondapochamma sagar, కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణ లేటెస్ట్ వార్తలు, సీఎం కేసీఆర్, హరీశ్ రావు, మేడిగడ్డ బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్


కొత్తగా 18.25 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ సస్యశ్యామల ప్రాజెక్ట్, ఫ్లడ్ ఫ్లెకెనాల్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీరందించనుంది. దీంతో సిరిసిల్ల నుంచి వరంగల్ అర్బన్ దాకా ఎఫ్ఎఫ్‌సి ఆయకట్టు రైతుల కష్టాలు శాశ్వతంగా తొలిగినున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్ 1 పరిధిలోని 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించి జగిత్యాల నుంచి ఖమ్మం దాకా ప్రవహించనుంది.ఎస్సారెస్పీ స్టేజ్ 2 ఆయకట్టును స్థిరీకరించి వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు మేలు చేయనుంది. 2.34 లక్షల ఎకరాల నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోయనుంది. సింగూరును నింపి సంగారెడ్డి జిల్లా కష్టాలు శాశ్వతంగా తొలగించనుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా తెలంగాణలోని అనేక జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని తెలంగాణ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>