Home /News /telangana /

TELANGANA EMPLOYEES JAC CONDEM OF GONE PRAKASH RAO COMMENTS ON COLLECTORS VRY

Telangana news : గోనే ప్రకాశ్ రావు క్షమాపణలు చెప్పాలని.. ఉద్యోగులు జేఏసి.. డిమాండ్..!

Gone prakash rao

Gone prakash rao

Telangana news : ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు ఖండించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

    ఐఏఎస్ , ఐపిఎస్ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ( Gone prakash rao ) వ్యాఖ్యలు సరికావని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు అన్నారు. ప్రకాశరావు ప్రధానంగా ఓ మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.

    ప్రభుత్వ యంత్రాంగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉద్యోగులు, ( Telangana employees jac ) అధికారుల మనోస్థైర్యం దెబ్బతింటుందని, దీనిపై కలెక్టర్​ను వివరణ అడిగితే సమాధానం వచ్చేదని అన్నారు. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చే బాధ్యత అధికారులు, ఉద్యోగులదేనని, రాజకీయ నేతలు, యంత్రాంగం సమన్వయంతో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారని, ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమే కానీ ఒక కలెక్టర్‌పై.. అది కూడా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీనియర్​ నేత గోనె ప్రకాశరావుకు తగదని వారు హితవుపలికారు.

    Asaduddin Owaisi : భారత్ కేవలం హిందువులదే కాదు... అందరిది... రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్


    ఆదిలాబాద్​, రంగారెడ్డి కలెక్టర్లపై అదే విధంగా ఐపీఎస్‌ అధికారుల పై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్‌, సెక్రెటరీ జనరల్ మమత, ఇతర నేతలు డిమాండ్ చేశారు.

    కాగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై గోనే ప్రకాశ్ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ఆమె తన బయోడేటా గురించి ఆరా తీశారని, ఓ జర్నలిస్ట్‌ను అడిగి తన గురించి తెలుసుకున్నారని చెబుతూ.. సీఎం కేసిఆర్ బాషాలో రెండు వేళ్లు చూపిస్తూ... ఆమె చీర తడపకపోతే తన పేరు గోనె ప్రకాష్ రావే కాదంటూ సవాల్ విసిరారు.

    Bandi sanjay : బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి... టీఆర్ఎస్‌ పని అయిపోయింది...!


    స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చివరి రోజున 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 22 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఛాంబర్‌లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే అభ్యర్థులు కాకుండా... ఇతర నేతలు ఆమె చాంబర్‌లో సుమారు మూడు గంటల పాటు ఎందుకు ఉంటారని ఆయన ప్రశ్నించారు. ( RTC ex chairman Gone prakash rao ) ఈ క్రమంలోనే ఆ రోజు సీసీ ఫుటేజీ తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లు పాటించలేదని.. అన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిషాను కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే తన గురించి ఎంక్వయిరీ చేసిన కలెక్టర్ కు వార్నింగ్ ఇస్తున్నానంటూ కేసిఆర్ ‘కేసీఆర్ భాషలో లాగు తడవాలని అంటారు కదా.. నేను ఆమె చీర తడుపుతా’ అంటూ గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Employees, Hyderabad, Telangana

    తదుపరి వార్తలు