ఒడిశాను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అరుదైన సహాయం...

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన 1000 మంది ఉద్యోగులను ఒరిస్సాకు పంపాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు ఒడిశాకు బయలుదేరి వెళ్లారు.

  • Share this:
    ఫణి తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ఒడిశా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ నుండి వెయ్యి మంది విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఒరిస్సాకు వెళ్లారు. తుఫాను ప్రభావం వల్ల కరెంటు స్థంభాలు పడిపోయాయి. లైన్లు తెగిపోయాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకారం అందించాలని ఒడిశా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో మాట్లాడారు. ఒడిశాకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన 1000 మంది ఉద్యోగులను ఒరిస్సాకు పంపాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు ఒడిశాకు బయలుదేరి వెళ్లారు.

    ఇదిలా ఉంటే ఫణి తుఫాను దెబ్బకు ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో రవాణా, విద్యుత్, తాగునీరు వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కేంద్రం కూడా తక్షణ సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు సైతం ఒడిశాను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా నిర్వాసితులకు భోజన ఏర్పాట్లు, పునరావాసం కల్పించడం ఒడిశా ముందు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.
    First published: