news18-telugu
Updated: October 9, 2018, 10:55 PM IST
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Image: Facebook)
ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. నెల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో ఇప్పటికీ సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. దాంతో కాంగ్రెస్‌పై తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూల్ విడుదలయినా ఇంకా పొత్తులు ఖరారు చేయకపోవడంపై మండిపడ్డారు. త్వరగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు. లేని పక్షంలో భావసారూప్యత కల్గిన ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుంటామని అల్టిమేటం జారీ చేశారు.
పొత్తులు, సీట్లపై 48 గంటల్లో తేల్చాలని..లేకుంటే మాదారి మేం చేసుకుంటామని కోదండరామ్ హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు తాము కోరిని సీట్లు ఇవ్వాలని, లేదంటే కలిసొచ్చే పార్టీలో కలిసి ఎన్నిలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేశారి..మరో రెండు రోజుల్లో ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తాజా పరిణామాల నేపథ్యంలో టీజేఎస్ ఆఫీసులో కోదండరామ్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మంతనాలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. ఇక కోదండరామ్ డెడ్ లైన్ విషయం తనకు తెలియదన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. గోల్కొండ రిసార్ట్స్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అభ్యర్థుల ఎంపిక పకడ్బండీగా జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా..మహాకూటమి ఇప్పటికీ చర్చల దశలోనే ఉండడంపై పలు పార్టీల్లో నిరుత్సాహం నెలకొంది. ఐతే పొత్తులు, సీట్ల సర్దుబాటుపై మంగళవారం మహాకూటమి నేతలు చర్చలు జరపాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడడంతో..గురువారం వారు సమావేశం కానున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 9, 2018, 10:17 PM IST