తెలంగాణలో తొలిసారి వీవీపాట్...ఓటు ఎవరికి పడిందో చూసుకోవచ్చు..

Telangana assembly elections 2018 | తెలంగాణలో వీవీపాట్‌లు తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఐతే మన దేశంలో 2013లో తొలిసారిగా వీవీపాట్‌ అందుబాటులోకి వచ్చింది. నాగాలాండ్‌లోని నొక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఈసీ వీటిని వినియోగించింది.

Shiva Kumar Addula | news18-telugu
Updated: December 6, 2018, 3:43 PM IST
తెలంగాణలో తొలిసారి వీవీపాట్...ఓటు ఎవరికి పడిందో చూసుకోవచ్చు..
వీవీపాట్
  • Share this:
అమెరికా సహా చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్‌ కోసం ఇప్పటికీ పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నారు. కానీ భారత్‌లో అత్యాధునిక సాంకేతికత కలిగిన EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)లను వాడుతున్నారు. ఐతే కొన్నేళ్లుగా ఈవీఎంల తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంను సులభంగా ట్యాంపరింగ్ చేయవచ్చని పలు రాజకీయ పార్టీలు గగ్గోలు చేస్తున్నాయి. ఓటు ఒకరికి వేస్తే..మరొకరికి పడుతోందని ఆరోపించాయి. ఈ క్రమంలోనే పోలింగ్‌లో మరింత పారదర్శకత కోసం వీవీపాట్ యంత్రాలను తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. వాటి ద్వారా మనం వేయాలనుకున్న అభ్యర్థికే ఓటు పడిందా? లేదంటే ఇతరులకు పడిందా? అనేది నిర్ధారించుకోవచ్చు.

VVPAT అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇదో చిన్న ప్రింటర్. ఈ యంత్రాన్ని ఈవీఎంకు అనుసంధానం చేస్తారు. బ్యాలెట్ యూనిట్‌లో మనకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్ ఓ స్లిప్‌ను ముద్రిస్తుంది. అందులో మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. ఒక రకంగా మనం వేసిన ఓటుకు అది రశీదు లాంటిది. ఐతే ఆ స్లిప్‌ను మనం తీసుకోలేం. వీవీపాట్‌పై అమర్చబడిన గాజు తెరపై 7 సెకన్ల పాటు స్లిప్ కనిపిస్తుంది. ఆ సమయంలో మనం ఏ అభ్యర్థికి ఓటు వేశామో చూసుకోవచ్చు. అనంతరం బీప్ శబ్దంతో సీల్డ్ బాక్స్‌లో పడిపోతుంది.

తెలంగాణలో వీవీపాట్‌లు తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఐతే మన దేశంలో 2013లో తొలిసారిగా వీవీపాట్‌ అందుబాటులోకి వచ్చింది. నాగాలాండ్‌లోని నొక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఈసీ వీటిని వినియోగించింది. ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో 2014 సాధారణ ఎన్నికల్లో వీవీపాట్‌లను వినియోగించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఐతే అప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని పోలింగ్‌ బూత్‌లలో మాత్రమే వీవీపాట్‌లను వినియోగించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ బూత్‌లోనూ వీవీపాట్ యంత్రాలను ఉపయోగిస్తామని ఈసీ అధికారులు తెలిపారు.

వీవీపాట్ పని తీరు-డెమో:


First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు