హోమ్ /వార్తలు /తెలంగాణ /

రాలిన కమలం రేకులు..బీజేపీ పరువు కాపాడిన ఒకే ఒక్కడు

రాలిన కమలం రేకులు..బీజేపీ పరువు కాపాడిన ఒకే ఒక్కడు

Telangana elections 2018 result | ఈసారి గోషామహల్ మినహా మిగతా స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. అంబర్‌పేట్‌లో కిషన్ రెడ్డిపై కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్‌లో లక్ష్మణ్‌పై ముఠా గోపాల్, ఖైరాతాబాద్‌లో చింతలపై దానం నాగేందర్, ఉప్పల్‌లో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌పై భేతి సుభాష్ రెడ్డి విజయం సాధించారు

ఇంకా చదవండి ...

  తెలంగాణలో కింగ్ మేకర్ అవుదామనుకున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. అదనంగా సీట్లు గెలవకపోగా..4 సిట్టింగ్ స్థానాలు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ (ముషీరాబాద్), కిషన్ రెడ్డి (అంబర్ పేట్), ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్(ఉప్పల్), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్) ఓటమి పాలయ్యారు. ఈ సారి ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కరు గెలిచారు. గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్..కమలదళం పరువు కాపాడారు. సమీప ప్రత్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై ఆయన విజయం సాధించారు.

  గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 118 స్థానాల్లో బరిలోకి దిగింది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి అగ్రనేతలతో పాటు స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేసినప్పటికీ బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. టీఆర్ఎస్‌కు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

  2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఐదు స్థానాల్లో గెలిచింది. అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఐత ఈసారి గోషామహల్ మినహా మిగతా స్థానాల్లో ఓడిపోయింది. అంబర్‌పేట్‌లో కిషన్ రెడ్డిపై కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్‌లో లక్ష్మణ్‌పై ముఠా గోపాల్, ఖైరాతాబాద్‌లో చింతలపై దానం నాగేందర్, ఉప్పల్‌లో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌పై భేతి సుభాష్ రెడ్డి విజయం సాధించారు.

  ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలంతా ఓడిపోయి హిందూత్వ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ గెలవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తెలంగాణ బీజేపీ నేతలు ఆయన్ను దూరంపెట్టారు. సొంత పార్టీలో రెబెల్‌లా వ్యవహరించే రాజాసింగ్... అప్పట్లో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని తీవ్రంగా విభేదించేవారు. పార్టీ అధ్యక్ష పదవిలోంచి కిషన్ రెడ్డిని తొలగించాలంటూ గళం విప్పారు. అప్పట్లో ఏకంగా అమిత్ షాకే లేఖ రాశారు. పార్టీకి రాజీనామా కూడా చేశారు. కానీ కొంతకాలానికి మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు.

  కరుడుగట్టిన హిందుత్వవాది అయిన రాజాసింగ్ తన రాజకీయ ప్రయాణాన్ని మాత్రం టీడీపీ నుంచి మొదలుపెట్టారు. 2009లో మంగళ్‌హట్ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014లో బీజేపీ నుంచి గోషామహల్‌ అసెంబ్లీకి పోటీ చేశారు. ఉత్తరాది ప్రజలు ఎక్కువగా ఉండే గోషామహల్ ప్రాంతంలో... కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరుతెచ్చుకున్న రాజాసింగ్ 46,793 ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం. 2014లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌ని చిత్తుగా ఓడించారు రాజాసింగ్. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ను ఓడగొట్టి..బీజేపీలో ఒకే ఒక్కడుగా నిలిచారు.

  First published:

  Tags: Raja Singh, Telangana Election 2018

  ఉత్తమ కథలు