జీవితంలో తొలిసారి ఓటువేసిన గద్దర్

గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్టు పార్టీలో చేరారు గద్దర్. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కనీసం ఓటు కూడా వేయలేదు. ఐతే ఎట్టకేలకు 70 ఏళ్ల వయసులో తొలిసారి ఓటువేశారు.

news18-telugu
Updated: December 7, 2018, 4:14 PM IST
జీవితంలో తొలిసారి ఓటువేసిన గద్దర్
ఓటువేసిన గద్దర్
news18-telugu
Updated: December 7, 2018, 4:14 PM IST
ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి అల్వాల్‌లోని వెంకటాపూర్‌లో ఓటు వేశారు. ఓటు వేయడానికి వచ్చిన గద్దర్ దంపతుల చేతిలో అంబేద్కర్, జ్యోతి బాపులే చిత్ర పటాలు కనిపించాయి. 70 ఏళ్ల వయసున్న గద్దర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. ఆయన ఓటు వేయడం ఇదే తొలిసారి.

70 ఏళ్ల వయసు తర్వాత తొలిసారి ఓటువేశా. ఓట్లవిప్లవం రావాలి. రాజకీయ నిర్మాణ రూపం. ఓట్లతో రాజకీయ మార్పు రావాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నూటికి నూరు పాలు ఓటు హక్కు వినియోగించుకోండి. అమరవీరులకు జోహార్లు. వారి స్వప్నాలను నిజం చేద్దాం. మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది.
గద్దర్

గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా చేసే సమయంలో మావోయిస్టు పార్టీలో చేరారు గద్దర్. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కనీసం ఓటు కూడా వేయలేదు. ఐతే ఎట్టకేలకు 70 ఏళ్ల వయసులో తొలిసారి ఓటువేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రజాకూటమి తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...