వీటిలో ఏది చూపించినా ఓటేయొచ్చు... తాగొస్తే కఠిన చర్యలు: రజత్ కుమార్

తెలంగాణలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాకాధికారి రజత్ కుమార్ తెలిపారు. 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని అన్నారు. పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు నిషేధించామని, మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

news18-telugu
Updated: December 6, 2018, 7:33 PM IST
వీటిలో ఏది చూపించినా ఓటేయొచ్చు... తాగొస్తే కఠిన చర్యలు: రజత్ కుమార్
రజత్ కుమార్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: December 6, 2018, 7:33 PM IST
తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. . కొత్తగా 20 లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారని చెప్పారు. 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చని అన్నారు. పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు నిషేధించామని, మద్యం సేవించి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ రజత్‌కుమార్ హెచ్చరించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతి సారి పోలింగ్ శాతం 55 కంటే ఎక్కువ లేదని, ఏడున్నర లక్షల మంది మొదటి సారి ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం అన్ని సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ రజత్ కుమార్ ఆదేశించారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. క్యూ లైన్లో ఉన్నవారికి 5గంటల తర్వాత కూడా ఓటు వేయొచ్చని తెలిపారు.

పోలింగ్‌ నూరు శాతం పారదర్శకంగా జరుగుతుందని రజత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే రీపోలింగ్‌ కూడా జరుపుతామన్నారు. 100 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది కూడా రాత్రికే కేంద్రాలు చేరుకుంటారన్నారు.ఈవీఎంలు, వీవీ ప్యాట్లు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్యలు వస్తే వెంటనే సరిచేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా టెక్నికల్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 3, 478 పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. అలాగే ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. నగదు, మద్యం పంపిణీ అనేక ఫిర్యాదులొచ్చాయన్నారు. డబ్బు పంపిణీపై 250 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.137 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఈ నెల 26 నుంచి ఓటర్ల జాబితాను మళ్లీ సవరిస్తామని రజత్ కుమార్ వెల్లడించారు.


First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు