తెలంగాణ ఎన్నికలు 2018: లగడపాటి ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఆసక్తి

Telangana Elections 2018 | Lagadapati Exit poll | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ వెల్లడించనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

news18-telugu
Updated: December 7, 2018, 6:34 PM IST
తెలంగాణ ఎన్నికలు 2018: లగడపాటి ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఆసక్తి
లగడపాటి రాజగోపాల్( ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: December 7, 2018, 6:34 PM IST
తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నారు. శుక్రవారం 7 గం.లకు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్న లగడపాటి...తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో లగడపాటి ఏమి చెప్పబోతున్నారో సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ల తీర్పు ఏ గట్టును నిలిచారో? లగడపాటి వెల్లడించే అవకాశం ఉంది. గతంలో లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు నిజం కావడంతో...ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈ విజయవాడ మాజీ ఎంపీ వెల్లడించనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందరిలోనూ సహజంగానే ఆసక్తిరేపుతున్నాయి.

తెలంగాణ ఎన్నికలపై లగడపాటి వెల్లడించిన సర్వే ఫలితాలు ఆసక్తిని రేకెత్తించాయి. స్వతంత్ర అభ్యర్థులు 8-10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించిన ఈ ఆంధ్ర అక్టోబస్...గెలిచే అవకాశాలున్న ఐదుగురి పేర్లను కూడా వెల్లడించారు. అలాగే ప్రజానాడి కాంగ్రెస్ వైపే ఉందని కుండబద్ధలు కొట్టారు. బీజేపీ కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు.


లగడపాటి వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ కూడా ధీటుగా స్పందించారు. లగడపాటిది సర్వేకాదు...చిలక జోస్యమని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకే సర్వే ఫలితాలను మార్చారని ఆయన ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 7 గం.లకు లగడపాటి వెల్లడించనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు