news18-telugu
Updated: December 4, 2019, 9:45 AM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ తేదీలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నెల 5 లేదా 6వ తేదీ్లో ప్రారంభించే యోచనలో ఉన్నత విద్యామండలి ఉనంది. మే నెల 3వ తేదీన నీట్ జరగనుంది. ఆ పరీక్షకు, ఎంసెట్‌కు ఒకట్రెండు రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు అధికారులు. 5 లేదా 6న ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడదుల చేశారు. తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను SSC బోర్డు విడుదల చేసింది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 4, 2019, 9:44 AM IST