తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రామగుండం సీపీ సత్యానారయణ అన్నారు. హెలిప్యాడ్ వద్దే అధికారులతో మావోయిస్టు కదలికలపై సమీక్షించారు. అక్కడి నుంచి ఉట్నూరు బయల్దేరి వెళ్లారు డీజీపీ. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆదిలాబాద్, తిర్యాణి, నార్నూర్, దేవపూర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఐతే మహేందర్ రెడ్డి పర్యటనను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఐనప్పటికీ చిక్కలేదు.
మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన అనుచరులు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి గత రెండేళ్ల క్రితమే అనారోగ్య కారణాల వల్ల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకొన్నారు. తీవ్ర అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మాటలోనే మరికొందరు మావోయిస్టులు లొంగిపోయే అవకాశముంది. ఇక ఇటీవల ఆదిలాబాద్‌లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టు భాస్కర్ రావు డైరీ దొరికింది. అందులో మావోయిస్టు డైరీలో కొందరు ప్రముఖ మావోయిస్టుల పేర్లున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DGP Mahendar Reddy, Maoists, Telangana, Telangana Police