హోమ్ /వార్తలు /తెలంగాణ /

Lock up Death : మరియమ్మ కొడుకును పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి..

Lock up Death : మరియమ్మ కొడుకును పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి..

Lock up Death : దొంగతనం కేసులో అరెస్ట్ అయి..పోలీసుల చేత చిత్రహింసలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకును తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. కాగా ఇదే కేసులు పోలీసులు పెట్టిన చిత్రహింసలకు స్టేషన్‌లోనే మరియమ్మ ప్రాణాలు కొల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం 
సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Lock up Death : దొంగతనం కేసులో అరెస్ట్ అయి..పోలీసుల చేత చిత్రహింసలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకును తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. కాగా ఇదే కేసులు పోలీసులు పెట్టిన చిత్రహింసలకు స్టేషన్‌లోనే మరియమ్మ ప్రాణాలు కొల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Lock up Death : దొంగతనం కేసులో అరెస్ట్ అయి..పోలీసుల చేత చిత్రహింసలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకును తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. కాగా ఇదే కేసులు పోలీసులు పెట్టిన చిత్రహింసలకు స్టేషన్‌లోనే మరియమ్మ ప్రాణాలు కొల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇంకా చదవండి ...

  ఈ నేపథ్యంలోనే ఏకంగా రాష్ట్ర డీజిపి సీఎం కేసిఆర్ ఆదేశాలతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

  పొందుతున్న ఉదయ్‌కిరణ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆ రోజు స్టేషన్‌లో జరిగిన విషయాలు

  తెలుసుకున్నారు. అడ్డగూడురుకు తీసుకుపోయిన తర్వాత జరిగిన పరిమాణాలపై ఆరా తీశారు. అసలు

  మరియమ్మను , ఉదయ్‌ కిరణ్‌ను ఎవరేవరు కొట్టింది ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

  కాగా పోలీసులు తనను అంత్యంత క్రూరంగా హింసించారని ఉదయ్ కిరణ్ కన్నీరు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంధర్భంగా తనకు న్యాయం చేయాలని వేడుకున్నట్టు సమాచారం. స్పందించిన డీజీపీ సరైన న్యాయం చేస్తామని హామి ఇచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలపై మాట్లాడారు. లాకప్‌డెత్ కేసులో జరిగిన విషయాలు నేరుగా తెలుసుకున్నానని , పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామని అన్నారు. ఇక చట్టానికి విరుద్దంగా ఎవరు వ్యవహరించినా...చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  కాగా ఈ కేసులో ఇప్పటికే భాద్యులైన ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడంతోపాటు స్థానిక ఏసిపీని సైతం రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. మరోవైపు శనివారం పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. స్థానిక ఏసిపి శ్యామ్‌ప్రసాద్, ఓఎస్డీ మల్లారెడ్డిలు అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో విచారణ జరిపారు.స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలతోపాటు లాకప్ గదులను పరిశీలించారు. సీసీ కెమెరాలను పని చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉన్న రెండు సీసీ కెమెరాల్లో రిపేరు చేయించినా పనిచేయడం లేదని ఇంచార్జి ఎస్సై చెప్పినట్టుగా తెలుస్తోంది..

  పోలీసులతోపాటు మరియమ్మ లాకప్‌డెత్‌ను హైకోర్టు కూడా సీరియస్‌గా తీసుకోవడంతో జుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం. మణికంఠం సైతం అడ్డగూడురు పోలీసు స్టేషన్‌కు వెళ్లి విచారణ జరిపారు. అనంతరం నివేదికను హైకోర్టుకు   అందజేయనున్నారు.

  First published:

  Tags: DGP Mahendar Reddy, Khammam

  ఉత్తమ కథలు