అగ్నిప్రమాదంలో చిక్కుకున్న పశువులను రక్షించిన ఇద్దరూ కానిస్టేబుల్స్‌ను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్ డన్ కానిస్టేబుల్స్ అంటూ అభినందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా రామన్నపేట పోలీసు స్టేషన్లో పంజాల యాదగిరి, కోమటిరెడ్డి రవీందర్‌రెడ్డిలు కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా రామన్నపేటకు వెళ్తుండగా ఇస్కిళ్ల గ్రామపరిధిలో రోడ్డు వెంట ఓ పశువుల కొట్టానికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్స్ గమనించి వెంటనే ఫైరింజన్‌కు సమాచారం అందించారు. అప్పటికే మంటలకు కొట్టంలోని పశువులు అల్లాడిపోతుండడాన్ని గమనించిన వారు లోపలికి వెళ్లి తాళ్లతో కట్టేసి ఉన్న పశువులను విడిపించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి వారిద్దరిని ట్విట్టర్లో కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు.
WellDone dear #ConstableOfficers Yadagiri & Ravinder Reddy.
Preparedness is all about making yourselves ready to act on, taking any risk/challenge instantaneously.
Spontaneity when added, you can serve more effectively & this can only be driven by an attitude called Caring'. https://t.co/iZmfC3V54G
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) April 22, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.