వైద్యుల భద్రతకు డీజీపీ కీలక నిర్ణయం.. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆ పని..

వైద్యుల రక్షణ కోసం పోలీసు కమిషనరేట్లు, జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

news18-telugu
Updated: April 5, 2020, 11:01 PM IST
వైద్యుల భద్రతకు డీజీపీ కీలక నిర్ణయం.. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆ పని..
తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి(ఫైల్)
  • Share this:
వైద్యుల భద్రత కోసం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో వైద్యులపై రోగి బంధువలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. కరోనా నియంత్రణకు అహార్నిశలు శ్రమిస్తున్న డాక్టర్లు, ఇతర అధికారుల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను ట్వీట్ చేశారు. వైద్యుల రక్షణ కోసం పోలీసు కమిషనరేట్లు, జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ గ్రూపుల ద్వారా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. వారికి ఏర్పడిన ఇబ్బందికి సంబంధించిన సమాచారాన్ని గ్రూపులో పోస్టు చేస్తే.. త్వరగా స్పందించేందుకు వీలు ఉంటుందని డీజీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని వైద్యులు, పోలీసులతో కలిపి ప్రత్యేకంగా మెడికల్ వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. దీంతోపాటు నగర పరిధిలోని వైద్యులు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లను కలిపి నోడల్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశామని ఆయన తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: April 5, 2020, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading