Home /News /telangana /

KCR Biopic: కేసీఆర్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు.. వివరాలివే..

KCR Biopic: కేసీఆర్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు.. వివరాలివే..

Image credit : twitter

Image credit : twitter

KCR Biopic: ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు. కేసీఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటించిన ఈ సినిమాను వడత్యా హరీష్ డైరెక్ట్ చేశారు. దీనికి సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  సినీ పరిశ్రమలో బయోపిక్ ల(Biopics) ట్రెండ్ (Trend) ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో నడుస్తోంది. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ ఎక్కువగా ఉంది. స్ఫూర్తిదాయక ప్రముఖులు, గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు, మహామహుల జీవితాలకు వెండితెర రూపమిచ్చేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు. నిజ జీవితా కథా చిత్రాలు ఇప్పటికే నిర్మితం అయ్యాయి. ప్రముఖుల జీవిత చరిత్రలను వెండితెరకు పరిచయం చేసేందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో.. అలాగే రాజకీయ నాయకులు బయోపిక్ లను కూడా వెండితెరకు చూపించేందుకు ఉత్సుకతను చూపిస్తున్నారు దర్శక , నిర్మాతలు.

  Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ ఫ్యాన్స్ కు భారీ షాక్.. అసలేం జరుగుతోంది..


  దీనిలో ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ముందున్నాడనే చెప్పాలి. అతడు ఎంతో మంది ఆత్మకథలను వెండితెరపై చూపించాడు. ప్రస్తుతం కొండా సురేఖ దంపతులకు సంబంధించిన బయోపిక్ ను కొండా పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతక ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

  అంతే కాకుండా..   దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణం గురించి ’యాత్ర’ మూవీలో మమ్ముట్టి వైయస్ఆర్ ‌గా ముఖ్యమంత్రిగా నటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈయన ‘ఛీఫ్ మినిష్టర్’ అనే సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథపై తెంగాణ దేవుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిలో కేసీఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తుండగా... దీనికి వడత్యా హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.

  Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..


  ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ దాదాపు అయిపోయాయి. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. ‘చరిత్రను సృష్టించిన ఓ తెలంగాణ‌ ఉద్యమనాయకుడి పాత్రలో న‌టించ‌డం గర్వంగా ఉందన్నారు.

  Telangana Devudu Srikantha As Telangana Devudu Release On November 12 Before Srikanth Many Actors and Actress Who Plyed CM Charecters,Telangana Devudu : తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్..,Telangana Devudu,Srikanth,Srikanth As Telangana Devudu,Telangana Devudu Release November 12,NTR Chief Minister Charecter In balakrishna,Mahesh Babu As CM In Bharath Anu Nenu,Vijay Devarakonda CM in Nota,Krishna Mukhya Manthri,Rana Daggaubati Chief Minister Leader,Kangana Ranaut Chief Minister in Thalaivi,Tollywood, Actors, Plyed, CM, Charecter, Telugu, NBK, NTR, Balaiah, Bala Krishna, Krishna, Mahesh, Arjun, Rana, Jagapathi, టాలీవుడ్, బాలయ్య, ఎన్టీఆర్, మహేశ్, కృష్ణ, బాలకృష్ణ, రానా, అర్జున్, జగపతి బాబు, టాలీవుడ్ న్యూస్, ముఖ్యమంత్రి, వెండితెర ముఖ్యమంత్రి,ముఖ్యమంత్రి పాత్రల్లో అలరించిన బాలకృష్ణ,భరత్ అను నేను మహేష్ బాబు ఛీఫ్ మినిష్టర్,నోటాలో ముఖ్య మంత్రిగా విజయ్ దేవరకొండ,లీడర్ మూవీలో ముఖ్యమంత్రిగా రానా దగ్గుబాటి,కంగనా రనౌత్ తలైవి మూవీలో సీఎం,ఇద్దరులో మోహన్‌లాల్,తెలంగాణ దేవుడు,శ్రీకాంత్ తెలంగాన దేవుడు
  తెలంగాణ దేవుడగా శ్రీకాంత్ (Twitter/Photo)


  వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించామన్నారు. సినీ నిర్మాత జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు నిఘంటువు, ఇలాంటి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి జీవితాన్ని తెరకెక్కించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు నిఘంటువు లాంటిదని, ఇంత గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి జీవితంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు నిర్మాత జాకీర్ ఉస్మాన్. ఈ సినిమాలో బ్రహ్మానందం, ఆలీ, సునీల్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అజయ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎంగా అయ్యేడనేది ఎంతో డ్రామాటిక్‌గా తెరకెక్కించారు.

  PMJDY: జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే రూ. 2.30 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. వివరాలివే..


  దీనిని జీషన్ ఉస్మానీ, మహ్మద్ జాకీర్ ఉస్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాకీర్ ఉస్మాన్ మూలకథను అందించారు. వడత్యా హరీశ్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. నందన్ బొబ్బిలి స్వరాలు అందించారు. అంతక ముందు సీఎం కేసీఆర్ జీవిత కథ నేపథ్యంలో ‘ఉద్యమ సింహం’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోకుండా.. యూట్యూబ్‌లో డైరెక్ట్‌గా విడుదలైంది. ‘ఉద్యమ సింహం’ సినిమా తర్వాత కేసీఆర్ జీవితంపై ‘తెలంగాణ దేవుడు’ పేరుతో శ్రీకాంత్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా తెలంగాణ సీఎం జీవితంపై ఒక బయోపిక్ అనౌన్స్ చేశారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: CM KCR, Srikanth, Telangana Devudu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు