Home /News /telangana /

TELANGANA DEPARTMENT OF MEDICAL HEALTH DIRECTOR SRINIVASA RAO SAID THAT OMICRON IS ALREADY IN THE COMMUNITY AND ESTIMATES ARE THAT MORE THAN 70 PER CENT ARE OMICRON CASES PRV

Corona cases in Telangana: తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతంపైగా ఒమిక్రాన్​వే.. హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు

హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాస రావు

హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాస రావు

వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో కరోనా కేసులు (Corona cases in Telangana) భారీగా పెరిగాయి. నిన్న వెయ్యి దాటిన కేసులు ఇవాళ రెండు వేలకు చేరువయ్యాయి. అయితే తెలంగాణలో కోవిడ్​ ఉధృతి పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో కరోనా (Corona) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గతవారం నుంచి ప్రతిరోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో కరోనా కేసులు (Corona cases in Telangana) భారీగా పెరిగాయి. నిన్న వెయ్యి దాటిన కేసులు ఇవాళ రెండు వేలకు చేరువయ్యాయి. అయితే తెలంగాణలో కోవిడ్​ ఉధృతి పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు  (Srinivasa Rao, Director, Department of Medical Health) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వైరస్ ప్రజా సమూహంలోకి వెళ్లిందని.. తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతానికి పైగా ఒమిక్రాన్ (Omicron) బాధితులే ఉంటారని భావిస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా డైరెక్టర్​ అన్నారు.

    15 రాష్టాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్లు..

    రాష్ట్రంలో లాక్ డౌన్ (Lockdown) విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు ముఖ్యమంటూ శ్రీనివాసరావు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి చివర్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని తెలిపారు. దేశంలో కూడా థర్డ్ వేవ్ (Third wave) మొదలైందంటూ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నిన్న ఒక్కరోజే లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొన్నారు. దేశంలోని 15 రాష్టాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో 1,600 కేసులు నిన్న నమోదయ్యాయని.. జీహెచ్‌ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దేశంలో 2 నుంచి 6 రేట్లు కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో బెడ్ల కొరత లేదన్నారు.

    1,913 మందికి పాజిటివ్..

    గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా టెస్టులు చేయగా 1,913 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో గురువారం వెల్లడించింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 1,214 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,036కు చేరింది. కరోనా నుంచి మంగళవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 ఐసోలేషన్, యాక్టివ్‌ కేసులు (Active cases) ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

    త్వరగా కోలుకుంటున్నారు..

    కోవిడ్ బారిన పడిన వాళ్లు దాదాపు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. కరోనా లక్షణాలుంటే.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కేసులు పెరిగాయని ఆయన తెలిపారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందన్నారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని  తెలిపారు. అయితే.. ఒమిక్రాన్ కేసులు వివరాలు ఇకపై రోజు వారి హెల్త్ బులిటెన్లో ఇవ్వమంటూ స్పష్టంచారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona cases, Omicron, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు