తెలంగాణ (Telangana) 2020-21లో రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులను సాధించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 12.98 శాతం పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే ఐటీ/ఐటీఈఎస్ ఎగుమతుల్లో ఇది 2.21 శాతం ఎక్కువ అని క్రెడాయ్-అనారోక్ నివేదిక పేర్కొంది 'తెలంగాణ: ఎ స్టేట్ ఆన్ ది మూవ్.'(Telangana: A State on the Move) నివేదిక ప్రకారం, రాష్ట్రం 2014లో ఏర్పడినప్పటి నుంచి ఐటీ రంగా బాగా అభివృద్ధి చెందింది. పెద్ద IT/ITeS కంపెనీల బలమైన ఉనికితో, రాష్ట్రంలో ప్రస్తుతం 6.3 లక్షల మంది ఉద్యోగులు రాష్ట్ర IT/ITeS రంగంలో పనిచేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
వివిధ IT/ITeS కంపెనీలు హైదరాబాద్ (Hyderabad)ను దాటి తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ (Warangal), కరీంనగర్ (Karimnagar) , నిజామాబాద్ (Nizamabad) వంటి టైర్ II నగరాలను ప్రత్యామ్నాయ IT/ITeS హబ్‌లుగా అన్వేషిస్తున్నాయి.
Covid 19 Vaccine: బూస్టర్ డోస్ తీసుకోవాలంటే.. సెకండ్ డోస్ తర్వాత ఇంత గ్యాప్ తప్పనిసరి!
ఈ నగరాల్లో తక్కువ ధరకే భూమిని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) అందుబాటులో ఉన్నాయి. అక్కడ అనేక ప్రొఫెషనల్ కాలేజీల నుంచి మెరుగైన టాలెంట్ ఉన్న విద్యార్థులను ఎంచుకొనే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి. CYIENT, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే వరంగల్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించాయని నివేదికలో వెల్లడించారు.
GMRC Recruitment: జీఎంఆర్‌సీలో 118 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్, వేతనం వివరాలు
ANAROCK గ్రూప్ సీనియర్ డైరెక్టర్ & హెడ్ - రీసెర్చ్ ప్రశాంత్ ఠాకూర్ ఈ విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం, IT/ITeS కార్యకలాపాలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్, నానక్‌రామ్‌గూడలో ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ, వర్క్ ఫ్రం హోం అవకాశం చాలా కంపెనీలకు వచ్చిందని.. దీనికి ప్రధాన కారణం కరోనానే అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు రాజధానితోపాటు టైర్-1, టైర్-2 నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. వివిధ కంపెనీలు ఇప్పటికే వరంగల్, కరీంనగర్ మరియు నిజామాబాద్‌లలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయని ఆయన అన్నారు. ఇవి మాత్రమే కాకుండా మరిన్న నగరాలను అన్వేషిస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పబ్లిక్ కనెక్టివిటీ గురించి ప్రశాంత్ ఠాకూర్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ల విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ మరియు బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ కారిడార్‌లు మెరుగ్గా ఉన్నాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.